27.7 C
Hyderabad
April 26, 2024 04: 23 AM
Slider నల్గొండ

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి

#AllPartyProtest

రైతుల భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే రైతు వ్యతిరేక వ్యవసాయ సంస్కరణల చట్టాలను ఉపసంహరించాలని అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం రైతు వ్యవసాయ సంస్కరణల చట్టాలను ఉపసంహరించాలని అఖిలపక్ష పార్టీలు, రైతు సంఘం నాయకులు గాంధీ పార్క్ సెంటర్ నుండి భారీ బైక్ ర్యాలీతో ఇందిరా సెంటర్ వద్దకు చేరి రాస్తారోకో నిర్వహించారు.

అనంతరం RDO కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి RDO కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ రైతులకు ఆదాయం పెంపు, వ్యవసాయం అభివృద్ధి పేరిట కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశ పెట్టి, రాజ్యసభలో మెజార్టీ లేనప్పటికీ అప్రజాస్వామికంగా మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

దేశంలో చిన్న, సన్నకారు రైతులు 80 శాతం మంది ఉన్నారని, వారి భూముల నుండి వెళ్ళగొట్టేందుకే బిజెపి ప్రభుత్వం ఇటువంటి బిల్లులు చేస్తున్నారని విమర్శించారు.

వ్యవసాయం రాష్ట్ర పరిధిలో ఉండాలి. కానీ రాష్ట్రాలకు సంబంధం లేకుండా చేసిన మూడు వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే భవిష్యత్తులో రైతు ఉద్యమాలను తీవ్రతరం చేయవలసి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అధ్యక్షత వహించగా సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి, పాలకూరి బాబు,రవి నాయక్, పోటు లక్ష్మయ్య, గుండు వెంకటేశ్వర్లు, తన్నీరు మల్లికార్జున్ రావు, అరుణ్ కుమార్ దేశముఖ్, బాచిమంచి గిరిబాబు,

నాగారపు పాండు,మేకల కనకారావు, యరగాని నాగన్న గౌడ్, గల్లా వెంకటేశ్వర్లు, మామిడి నర్సయ్య, జక్కుల రమేష్, పులిచింతల వెంకటరెడ్డి,దుగ్గి బ్రహ్మం,యల్లావుల రమేష్,జడ శ్రీనివాస్,ములకలపల్లి సీతయ్య,పల్లె వెంకటరెడ్డి,చిన్నం వీరమల్లు, జక్కుల మల్లయ్య,ఇందిరాల వెంకటేశ్వర్లు,చక్ర వీరారెడ్డి,

అజీజ్ పాషా,కస్తాల శ్రవణ్ కుమార్,రేపాకుల మురళి, హుస్సేన్, మేళ్ళచెరువు ముక్కంటి, బెల్లంకొండ గురవయ్య,కోలపూడి యోహాను,వెల్దండ వీరారెడ్డి,గుండెబోయిన వెంకన్న, శివరాం యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొవ్వాడ అణుపార్కును తక్షణమే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

Bhavani

డా.బి ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం నమూనా విడుదల

Bhavani

Leave a Comment