37.2 C
Hyderabad
March 29, 2024 17: 51 PM
Slider

ఆంధ్రా జల దోపిడికి కేసీఆర్ బాధ్యత వహించాలి

#Hujurnagar Congress

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంచుకుంటూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నేడు హుజుర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఇందిరా భవనంలో ఆంధ్ర జల దోపిడీకి నిరసనగా దీక్ష నిర్వహించారు.

దీక్షకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ అధ్యక్షత వహించగా దీక్షలో అఖిలపక్ష పార్టీ నాయకులు రాష్ట్ర ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి ఎరగని నాగన్న గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సాముల శివారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశముఖ్, ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర నాయకులు మేకల నాగేశ్వరరావు, స్థానిక నాయకులు బాచిమంచి గిరిబాబు,సిపిఎం జిల్లా నాయకులు పులిచింతల వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా నాయకులు కంబాల శ్రీనివాసు,బిజెపి జిల్లా నాయకులు మూసుకుల చంద్రారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గా సీఎం కేసీఆర్ ఊసరవెల్లి  రాజకీయాలు చేస్తున్నారని అధికారంలోకి రాకముందు ఆంధ్ర నాయకులు జల దోపిడీ చేస్తున్నారని గొంతు చించుకొని నేడు అధికారంలో ఉండి పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ సీఎంతో అలాయి బలాయి గా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొడ్డిదారిన 208 జీవో ద్వారా పోతిరెడ్డిపాడు విస్తరణ పెంచుతూ దక్షిణ తెలంగాణా ఎడారిగా మారేందుకు కారణమవుతుంటే సీఎం కేసీఆర్ ఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం శోచనీయమని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొనివచ్చి పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు నిలుపుదల చేయించాలని దానిని అమలు చేసేవరకూ నాగార్జునసాగర్ ఆయకట్టు అఖిలపక్ష పార్టీలు రైతు సంఘాలు రోజువారీ కార్యాచరణతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ రైతు పక్షాన పోరాడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో లో కస్తాల శ్రవణ్ కుమార్,ములకలపల్లి రామ గోపి, రైతు సంఘం నాయకులు దుర్గి బ్రహ్మం, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు మహేష్ ,మండల ఐఎన్టియుసి అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి,పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపూడి యోహాన్, పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు పాశం రామరాజు,ప్రధాన కార్యదర్శి పోయిన రామ్మూర్తి ,పార్టీ నాయకులు వీరారెడ్డి, వెంకటేశ్వర్లు,జగన్,వేముల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

క్రీస్తు మార్గం అందరికి అనుసరణీయం

Satyam NEWS

నిరుపేదల పాలిట వరం CMRF పథకం

Satyam NEWS

పువ్వాడ ను పరామర్శించిన తమ్మినేని

Satyam NEWS

Leave a Comment