27.7 C
Hyderabad
April 19, 2024 23: 49 PM
Slider విశాఖపట్నం

విశాఖ ఉక్కును అమ్మే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు

#VizagSteel

ప్రభుత్వం దేశం అభివృద్ది కి చర్యలు తీసుకోవాలి కానీ ప్రభుత్వం రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కాదని అఖిల పక్ష కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నేటి నుంచి వారు నిరాహారదీక్ష లు ప్రారంభించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఇప్పటికే అనేక ఆందోళన లు చేశామని, ఇకపై కూడా రాజీలేని పోరాటం చేస్తామని వారు అన్నారు. ఈ ఏడాదిలో విశాఖ స్టీల్ ప్లాంట్ 18 వేల కోట్ల రూపాయలు టర్నోవర్ చేసిందని, బ్యాంక్ ల వద్ద తీసుకున్న వడ్డీ కూడా చెలిస్తున్నామని వారు తెలిపారు.

ఇలాంటి లాభసాటి సంస్థను కేంద్ర ప్రభుత్వం మంకుపట్టుతో ప్రయివేటుపరం చేస్తున్నదని వారు తెలిపారు. విశాఖ స్టీల్ ను అమ్మే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని వారన్నారు.

దేశంలో ఉన్నటు వంటి జాతీయ సంపదను  కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సరికాదని వారు  వ్యాఖ్యానించారు. స్టీల్ పరిశ్రమ పరిరక్షణ కోసం ఈ నెల 4 న బీచ్ లో వాక్ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.

Related posts

జిఎస్టి పేరుతో రాష్ట్రాన్ని మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS

మనం సైతం కాదంబరికి గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం

Satyam NEWS

వనపర్తి ఆర్టీసీ కార్గో వాహనంలో బెల్లం పట్టివేత

Satyam NEWS

Leave a Comment