37.2 C
Hyderabad
March 28, 2024 19: 28 PM
Slider విశాఖపట్నం

పెరిగిన జీతాలతో సహా బకాయిలు చెల్లించకపోతే పోరాటం ఉధృతం

#bugataashok

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు, సెక్యూరిటి గార్డుల కు ప్రభుత్వ జీవో ల ప్రకారం పెరిగిన జీతాలుతో సహా బకాయిలు మొత్తం చెల్లించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని  ఏ.పి మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( ఎఐటియుసి అనుబంధం ), ఏఐటీయూసీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ప్రభుత్వ వైద్యాధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు.

ఈ మేరకు విజయనగరం సర్వజనవైద్యశాలలో  పని చేస్తున్న శానిటేషన్ వర్కర్లకి, సెక్యూరిటి గార్డులకి బకాయిలు ఉన్న జీతాలివ్వాలని, ప్రభుత్వం ఇచ్చిన జీఓ ల ప్రకారం వేతనాలు పెంచాలని, పి.ఎఫ్, ఈ.ఎస్.ఐ సదుపాయాలు కల్పించాలని, అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి వర్కర్ల పై వేధింపులు ఆపాలని, ఫేస్ రికగ్నైజింగ్ సిస్టం ను రద్దు చేయాలని డిమాండ్లతో విజయనగరం హాస్పిటల్ సూపరింటెండెంట్ కార్యాలయం మహారాజ ఆసుపత్రి ముందు మోకాళ్ళ మీద నిలబడి నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా బుగత అశోక్  మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దశాలవారీగా హాస్పిటల్స్ లో ఉన్న పేషేంట్లకి ఇబ్బంది కలగకుండా, ఆసుపత్రులని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ శాంతియుతంగా పోరాటం చేస్తుంటే టి.వి.టి గ్రూప్, స్కాట్ లేండ్ గ్రూప్ కాంట్రాక్టర్లు పాలకుల దన్ను చూసుకుని వర్కర్స్ చేస్తున్న ఆకలి పోరాటాలను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు.

నెలల తరబడి జీతాలు చెల్లించకుండ శానిటేషన్ వర్కర్లతో, సెక్యూరిటి గార్డులతో గొడ్డు చెక్కిరి చేయించుకుంటారా అని మండిపడ్డారు. జీతాలు ఇవ్వనప్పుడల్లా రోడ్డెక్కి ధర్నాలు చేస్తేనే జీతాలు చేస్తారు లేకుంటే వారిని పస్థులు ఉంచుతారా అని ప్రశ్నించారు. జిల్లా ప్రభుత్వ సర్వజన, పి.హెచ్.సి, సి.హెచ్.సి, ఏరియా ఆసుపత్రలల్లో పనిచేశ్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య, పెస్ట్ కంట్రోల్ వర్కర్లకు ప్రభుత్వం జారీ చేసిన 549 జీవో ప్రకారం కాంట్రాక్ట్ వర్కర్స్ కి 16వేలు, సెక్యూరిటీ గార్డులకి జి.ఓ నెం. 43 ప్రకారం జోన్ 1 వారికి 11,912 /-, జోన్ 2 వారికి 11162 /-, జోన్ 3 10,912 /- జీతాలు ప్రకటించిన ప్రభుత్వం వర్కర్స్ జీతభత్యాల విషయం తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాకు చెందిన టి.వి.టి గ్రూప్స్ అనే కాంట్రాక్టురుకి, భీమవరంలో ఉన్న స్కాట్ ల్యాండ్ గ్రూప్ కాంట్రాక్టరుకి అప్పగించడం అంటే దళారీ వ్యవస్థను ఎంతలా పోషిస్తున్నారో తేటతెల్లమవుతుందని అన్నారు.

ఇలా దళారీ చేతుల్లో పెట్టడం వలన పెరిగిన వేతనాలు ఇవ్వకుండా, ప్రతి నెలా సక్రమంగా జీతాలు చెల్లించకుండా వర్కర్స్ బ్రతుకులతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. శ్రమకి తగిన జీతం లేక, ప్రతి నెల జీతాలు అందకపోవడం వలన ప్రభుత్వాలు పెంచుతున్న ధరల భారాలను తట్టుకోలేక అప్పులపాలు అయ్యి వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్టరు మారిన తర్వాత 20 మాసాలు నుంచి పి ఎఫ్ ఎంత జమ అవుతుందో, ఈఎస్ఐ ఎంత కటింగ్ చేస్తున్నారో ఇంతవరకు ఫే స్లిప్పులు ధ్వారా తెలియజేయకుండా నాటకాలాడుతూ తక్కువ వేతనాలు చూపిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు.

పెద్దాసుపత్రి నేడు మెడికల్ కాలేజి అయినందున వార్డులు పెరిగిడం వలన ఆసుపత్రిలో సరిపడా వర్కర్స్ నియమించకుండా తక్కువమంది వర్కర్స్ తో వెట్టిచాకిరీ చేయించుకుని ప్రభుత్వం జారీ చేసిన జీవో 549 ప్రకారం జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టరు కార్మికులందర్నీ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా సీజన్లో కూడా ఇల్లు, పిల్లల్ని వదిలి ప్రాణాలు పణంగా పెట్టి, కరోనా రోగులకు సేవ చేసి వర్కర్స్ అందరూ కరోనా బారిన పడిన వారిని కనీసం ఎవ్వరూ పట్టించుకోకపోగా ప్రభుత్వం మాత్రం వీరి పట్ల నిర్లక్ష్యం చూపుతుందన్నారు.

ప్రభుత్వ పెద్దలు వెంటనే కలుగజేసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ అందరిని అప్కాశ్ లో చేర్చి ప్రతి నెలా జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్కర్స్ తో కాయాకల్పలాంటి పనులు చేయించుకుని అవార్డులు అధికారులకి, కష్టించి పని చేస్తున్న వర్కర్స్ కి వేధింపులు, ఆకలి మిగులుతుందన్నారు. తక్షణమే అధికారులు స్పందించి పెండింగ్ జీతాలు చెల్లించి, ప్రభుత్వం ఇచ్చిన జీవో ల ప్రకారం కాంట్రాక్టర్లు చేత జీతాలు ఇప్పించి వర్కర్స్ సమస్యలు సామరస్యంగా పరిష్కారం చేయలేని పక్షంలో రానున్న రోజుల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రతరంగా చేస్తామని హెచ్చరించారు. తరువాత జరగబోయే పరిస్థితులకి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని బుగత అశోక్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మహారాజా, ఘోషా ఆసుపత్రిల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ వర్కర్స్, సెక్యూరిటి గార్డులు పాల్గొన్నారు.

Related posts

శ్రీరాజ‌రాజేశ్వ‌రి దేవిగా నేడు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

Satyam NEWS

ఎట్టకేలకు పెద్దపల్లి పోలీసులకు దొరికిన కిడ్నాపర్లు

Satyam NEWS

వాంటెడ్ జస్టిస్:రఘునందన్ రావు లైంగికదాడి చేసాడు

Satyam NEWS

Leave a Comment