40.2 C
Hyderabad
April 24, 2024 18: 58 PM
Slider ఖమ్మం

ప్రజల  రక్షణ కోసం బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి

#Vishnu warrior

ప్రజారక్షణకై అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.  బుధవారం టి ఎస్ ఎస్ పి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ నుండి ఖమ్మం జిల్లా ఆర్ముడ్ రిజర్వు  విభాగానికి  కన్వర్షన్ పై వచ్చిన 67 మంది పోలీస్ సిబ్బందితో పోలీస్ కమిషనర్ మాట్లాడారు.

పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కన్వర్షన్ పోలీస్ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ప్రస్తుత పరిస్థితులలో జిల్లాలో పోలీస్ వాహనాలకు డ్రైవర్ల అవసరం ఎక్కువ ఉన్న నేపధ్యంలో లైసెన్స్,అనుభవం, ఆసక్తి ఉన్న పోలీస్ సిబ్బందికి అయా సెక్షన్ లో ఆవకాశం కల్పిస్తామన్నారు.

అదేవిధంగా భవిష్యత్తులో వృత్తి పరంగా , టెక్నాలజీ పరంగా  అనుభవాలను పరిగణంలోకి తీసుకొని పోలీస్  విధులలో సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, అడిషనల్ డీసీపీ( ఎఆర్ ) కుమారస్వామి , ఆర్ఐ లు రవి, తిరుపతి , సాంబశివరావు పాల్గొన్నారు.

Related posts

కోల్‌కతా దీదీదే.. తృణమూల్‌ ‘హ్యాట్రిక్‌’

Sub Editor

కనకదుర్గ అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు సిద్ధం

Satyam NEWS

వచ్చే ఏడాది లో 500కోట్ల తో 150  పడకల వైద్య కళాశాల ప్రారంభం

Satyam NEWS

Leave a Comment