36.2 C
Hyderabad
April 16, 2024 21: 17 PM
Slider గుంటూరు

మహాశివరాత్రి నాడు కోటప్పకొండ తిరునాళ్లకు సర్వం సిద్ధం

#kotappakonda

ప్రముఖ శైవక్షేత్రం కోటప్ప కొండ మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. మరో రెండు రోజుల్లో తిరునాళ్ళ జరగనున్న నేపథ్యంలో మూడో సమన్వయ సమావేశం ఇవాళ జరిగింది. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పీ విశాల్ గున్ని, శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఉత్సవాలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు. వీఐపీలు వచ్చినప్పుడు సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. వచ్చిన ప్రతి భక్తుడు ప్రశాంతంగా స్వామి వారిని దర్శనం చేసుకొని ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లేలా ఎర్పాటు చేసినట్లు తెలిపారు. 2 వేల మంది పోలీసు సిబ్బందితో కమెండ్ కంట్రోల్ రూమ్ తో అనుక్షణం పర్యవేక్షణ ఉంటుంది అన్నారు.

ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేశారు. శనివారం నుంచే భక్తుల రాక ప్రారంభమైనా.. మార్చి 1న మహాశివరాత్రి రోజున తిరునాళ్లకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా అన్ని సౌకర్యా లూ కల్పించారు. తొలి ఏకాదశి సందర్భంగా రేపు కోటప్పకొండ పై ఎర్పాటు చేసిన శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహంతో పాటు, ఏకశిలా నంది విగ్రహం తొలి పూజను అందుకోనునన్నాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తిరునాళ్ళకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రత్యేక అనుభూతికి లోనయ్యేలా కొండపై శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహం, ఏకశిలా నంది విగ్రహం, కొండ అంతా ప్రతిధ్వనినించేలా ఓం నమః శివాయ మంత్ర జపం, చలువ పందిళ్ళు ఏర్పాటు చేశామని తెలిపారు.

క్యూలైన్లలలో భక్తుల కోసం మజ్జిగ, మంచినీరు ప్యాకెట్లు, మంచి నీటి బాటీళ్లు.. చిన్న పిల్లల కోసం పాలు, బిస్కట్లు సిద్దం చేశామన్నారు. 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు, రేపటి నుంచి వాటికి అనుగుణంగా సిబ్బంది పని చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు సమన్వయంతో పని  చేసి పండుగను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రాఫిక్ లేకుండా ఉంటేనే సగం పండుగ విజయవంతం అయినట్లే అని అన్నారు. ఇబ్బందిగా ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాత్రిపూట ఇంకా ఎక్కువ నిఘా పెట్టలన్నారు. శానిటేషన్  పరంగ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని సూచించారు.

Related posts

స్వార్థ రాజకీయాలకు చెక్ పెట్టే మునుగోడు ఎన్నికలు

Satyam NEWS

కంటివెలుగు కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు

Bhavani

ఎక్సపర్ట్ కామెంట్రీ: ఉండవెల్లి మౌనం ఎప్పుడు వీడతారో?

Satyam NEWS

Leave a Comment