28.7 C
Hyderabad
April 24, 2024 06: 51 AM
Slider విజయనగరం

ఎంఎల్‌సి ఎన్నిక‌ల‌కు ప‌క్కాగా ఏర్పాట్లు..!

#mlcelections

ఈ నెల 13 జరగనున్న ఉత్తరాంధ్ర ఎంఎల్‌సి ఎన్నిక‌ల‌కు ప‌క్కాగా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను  విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా లోని ఎస్‌కోట మండ‌లంలో ప‌ర్య‌టించిన కలెక్టర్… ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఏర్పాటు చేసిన ఎంఎల్‌సి ఎన్నిక‌ల‌ పోలింగ్ కేంద్రాన్ని ప‌రిశీలించారు. పోలింగ్ కేంద్రంలో లైట్లు, ఫ్యాన్లు త‌దిత‌ర , త్రాగునీరు త‌దిత‌ర మౌలిక వ‌స‌తుల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. త్రాగునీరు క్యూలైన్ల‌కు అందుబాటులో ఉండేలా చూడాల‌న్నారు. ప్రతీ పోలింగ్ బూత్‌కు వేర్వేరుగా బారికేడ్లు ఏర్పాటు చేసి, క్యూలైన్లు నిర్వ‌హించాల‌ని సూచించారు. ఎండ త‌గ‌ల‌కుండా షామియానా ఏర్పాటు చేయాల‌న్నారు. గ్రాడ్యుయేట్ ఓట‌ర్ల‌కు, ఓట‌ర్ స్లిప్పుల పంపిణీ, ఓటుకు ఆధార్ సీడింగ్‌పై బిఎల్ఓల‌ను ఆరా తీశారు. ఓట‌ర్ స్లిప్పుల పంపిణీని పూర్తి చేయాల‌ని ఆదేశించారు.

పాఠ‌శాల‌లోని 9,10 త‌ర‌గ‌తుల‌ను క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థుల‌తో మాట్లాడి, వారు ప‌రీక్ష‌ల‌కు సిద్ద‌మ‌వుతున్న తీరును తెలుసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన‌ సిల‌బ‌స్‌పై ఆరా తీశారు. ప‌రీక్షల్లో అత్య‌ధిక మార్కుల‌ను పొందాల‌ని, శ‌త‌శాతం ఉత్తీర్ణ‌త సాధించాల‌ని కోరారు.  తొమ్మిదో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం అంద‌జేసిన ట్యాబ్‌ల‌ను త‌నిఖీ చేశారు. ట్యాబ్ ద్వారా వారు ఎన్ని ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన‌దీ ఆరా తీశారు. ప్ర‌తీ విద్యార్ధీ త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌తిరోజూ పాఠ‌శాల‌కు ట్యాబ్‌ను తీసుకురావాల‌ని ఆదేశించారు.అక్కడ నుంచీ తిమిడి లో జ‌రుగుతున్న భూముల రీస‌ర్వే ప్ర‌క్రియ‌ను క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. రోజుకు ఎన్ని ఎక‌రాల స‌ర్వే చేస్తున్న‌దీ ఆరా తీశారు. స‌ర్వే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో తాశిల్దార్ డి.శ్రీ‌నివాస్‌, రీస‌ర్వే డిప్యుటీ తహశిల్దార్ పి.కీర్త‌న‌, వివిధ శాఖ‌ల మండ‌ల అధికారులు పాల్గొన్నారు.

Related posts

గిరిజ‌న కుటుంబాల పూర్తి మ‌ద్ధ‌తు

Sub Editor

ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్న జగన్ రెడ్డి

Satyam NEWS

విద్యార్ధులకు సన్నబియ్యం పెడుతున్న ఏకైక రాష్ట్రం మనదే

Satyam NEWS

Leave a Comment