30.3 C
Hyderabad
April 16, 2021 12: 39 PM
Slider విజయనగరం

81 అతి సమస్యాత్మక పోలీంగ్ స్టేషన్ లలో పోలింగ్.. బీ అలెర్ట్

#RajakumariIPS

విజయనగరం జిల్లాలో ఈ నెల 10న జరగనున్న ఒక మున్సిపల్ కార్పొరేషను, మూడు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసామని ఎస్పీ రాజకుమారీ తెలిపారు. మొత్తం 81 స్టేషన్లు అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని అక్కడ బందోబస్తు నిర్వహించే సిబ్బంది బీ అలెర్ట్ గా ఉండాలని ఎస్పీ తెలిపారు.

విజయనగరం మున్సిపల్ కార్పొరేషనులో 50 వార్డులకు, బొబ్బిలి మున్సిపాల్టీలో 30 వార్డులు, పార్వతీపురం మున్సిపాల్టీలో 24 వార్డులు, సాలూరు మున్సిపాల్టీలో 29 వార్డులు, నెల్లిమర్ల నగర పంచాయతీలో 20 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయన్నారు.

ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ అన్ని భద్రతా చర్యలను చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఎన్నికల్లో సమస్యలు సృష్టించేందుకు అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగా గుర్తించి, వారిపై 119 కేసులు నమోదు చేసి 1667మందిని మంచి ప్రవర్తన కొరకు బైండోవరు చేయడమైందన్నారు.

హిస్టరీ షీట్లు ఉన్న వారిని, గత ఎన్నికల్లో కేసులు ఉన్నవారిపై 5 కేసులు నమోదు చేసి, 35మందిని బైండోవరు చేసామన్నారు.ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా 526 తుపాకులును స్వాధీనం చేసుకున్నామని, 280 నాన్ బెయిలబుల్ వారంటును ఎగ్జిక్యూట్ చేసామన్నారు.

సారా, మద్యం, గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకుగాను ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టామని, సారా విక్రయించే వారిపై 9 కేసులు నమోదు చేసి, 21వేల అయిదు లీటర్లు నాటు సారాను, మద్యం అక్రమ రవాణా, అనధికారంగా విక్రయించే వారిపై 4 కేసులు నమోదు చేసి, 15.1 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఎన్నికలను శాంతి యుతంగా నిర్వహించేందుకుగాను సుమారు 2500మందిని వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఒకొక్క మున్సిపాల్టీలో ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకుగాను డిఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

Related posts

షాదిముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Satyam NEWS

సత్యం న్యూస్ చెప్పినట్లే కొట్టుకుపోయిన దేవాడ తాత్కాలిక రోడ్డు

Satyam NEWS

వేయి స్తంభాల గుడి నుంచి భారీ తిరంగా ర్యాలీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!