25.2 C
Hyderabad
January 21, 2025 09: 54 AM
Slider క్రీడలు

సీఎం కప్ 2024 రాష్ట్రస్థాయి పోటీలకు సర్వం సిద్ధం

#revanthreddy

సీఎం కప్ 2024 రాష్ట్రస్థాయి పోటీలు డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు జరగనున్నాయి. తెలంగాణ  స్పోర్ట్స్ అథారిటీ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నది. తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో, మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభకు ప్రోత్సాహం కల్పించాలన్న ఆశయంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. పల్లెల నుంచి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 రాష్ట్రస్థాయి పోటీలకు రంగం సిద్ధమవుతోంది.

మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయి నుండి నిర్వహిస్తున్న ఈ పోటీలు గ్రామస్థాయి, మండల స్థాయి మరియు  జిల్లా స్థాయి పోటీలు పూర్తిచేసుకుని రాష్ట్ర స్థాయికి చేరుకుంటాయి. డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు రాష్ట్రస్థాయి పోటీలు ఒక పండుగ వాతావరణం లో నిర్వహించుకోబోతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇందులో పాల్గొంటున్న దాదాపు రెండు లక్షల మంది కి పైగా క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సంక్షిప్తం చేయడం, క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందజేయడం క్రీడలకు ఆధునిక సాంకేతిక హంగులు సమకూర్చడం రాబోయే తరానికి దిక్సూచిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తోంది.

ఒక యజ్ఞం లాగా నిర్వహిస్తున్న ఈ సీఎం కప్ 2024 విజయవంతం చేయడంలో యావత్తు తెలంగాణ క్రీడా సంఘాలు, పీఈటీలు ఫిజికల్ డైరెక్టర్లు  స్వచ్ఛంద సంస్థలు పలువురు క్రీడాభిమానులు పాలుపంచుకుంటున్నారు. ఈ క్రీడల్లో పాల్గొని క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. వివక్షతకు తావు లేకుండా పారా క్రీడాంశాలో పోటీలు నిర్వహించుకోవడం ఈ సీఎం కపోటీలో మరో ప్రత్యేకత.

Related posts

పోలీసులపై దాడి చేశారంటూ రైతుల అరెస్టు దుర్మార్గం

Satyam NEWS

196 ల‌క్ష‌ల వ్య‌యంతో  విజ‌య‌న‌గ‌రం ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద వాట‌ర్ ట్యాంక్

Satyam NEWS

ఓ పోరాట యోధుని విజయం

Satyam NEWS

Leave a Comment