37.2 C
Hyderabad
March 28, 2024 18: 40 PM
Slider నల్గొండ

కరోనా నియంత్రణకు పటిష్ఠ చర్యలు

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పార్బైల్డ్ రైస్ మిల్లులో పనిచేస్తున్న సిబ్బంది,హమాలీలకు కరోనా నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని జిల్లా ప్రోగ్రామ్ అధికారిణి డాక్టర్ సాహితీ పరిశీలించారు.

ఈ సందర్భంగా డా||సాహితీ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు అన్ని స్థాయిల్లో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు. ప్రస్తుతం ధాన్యం అధికంగా ఉన్న కారణంగా రైస్ మిల్లులు ,ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలు, మార్కెట్ లలోని కూలీల ద్వారా కరోనా వ్యాప్తి అధికంగా ఉంటుంది కనుక విస్తృత పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ముఖ్యంగా కరోనా సోకిన వారు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని,ఇంటిలో వసతి లేనటువంటి వారు గ్రామంలోని పాఠశాలల యందు, గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ సెంటర్లను ఉపయోగించుకోవాలని సూచించారు.

మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ కోవిడ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించి కేసులు తగ్గించేందుకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఇందిరాల రామకృష్ణ,హైమావతి,ఉదయగిరి శ్రీనివాస్, మంగమ్మ, శ్రావణ్, ప్రశాంతి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వెయ్యి మంది మహిళలతో బతుకమ్మ సంబురాలు

Satyam NEWS

ముంపు ప్రాంతాలలో మర్రి రాజశేఖర్ రెడ్డి పర్యటన

Satyam NEWS

అగ్రరాజ్యంతో దోస్తీకి చైనా.. తైవాన్ సమస్యపై యూఎస్

Sub Editor

Leave a Comment