22.2 C
Hyderabad
December 10, 2024 11: 34 AM
Slider ప్రత్యేకం

నాగార్జున మరీ ఇంత రసిక రాజా…!!

#women

అదేంటో గానీ…మొన్నటి ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిన వైసీపీకి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా దెబ్బ మీద బెబ్బ తగులుతూనే ఉంది. పార్టీ అదికారంలో ఉండగా… మంత్రులుగా, ప్రభుత్వ సలహాదారులుగా, చీకటి జీవోల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా దర్పాన్ని ఒకలబోసిన వారంతా పార్టీ విపక్షంలోకి మారగానే… ఒక్కొక్కరుగా బయటపడిపోతూ ఉన్నారు. అది కూడా ఏదో చిన్న చిన్న ఆరోపణతో కాదు… జీవిత కాల శిక్ష పడే తరహా కేసుల్లో ఆ పార్టీల నేతలు ఇరుక్కుపోతున్నారు.

ఇప్పటికే ఇలా చాలా మంది వైసీపీ నేతలు ఇబ్బందులు పడుతుండగా… తాజాగా ఈ జాబితాలోకి మాజీ మంత్రి మేరుగు నాగార్జున వచ్చి చేరిపోయారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఈ దళిత నేత అత్యాచారం, ఆపై బాధితురాలపైనే బెదిరింపుల కేసులో అడ్డంగా బుక్కైపోయారు. మేరుగు నాగార్జున వ్యవహారం తెలియంగానే… మంత్రులుగా ఉంటూ మహిళలతో ఫోన్ లలో మాట్లాడుతూ తనకు అరగంట చాలునని అవంతి శ్రీనివాస్ అంటే… గంట చాలునంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఠక్కున గుర్తుకు వచ్చాయి.

నాడు ఈ ఫోన్ సంభాషణలు వెలుగులోకి రాడంతో అటు అవంతితో పాటు అంబటి తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్న నాగార్జున… వారిని తలదన్నేలా ఏకంగా బాధితురాలిపైనే బెదిరింపులకు పాల్పడుతూ ఈ తరహా వ్యవహారాల్లో తనను మించిన వారు ఎవరూ లేరన్న రీతిలో చెలరేగిపోతున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కు చేరగా… ఇంకా కేసు నమోదు కాని ఈ వ్యవహారం నాగార్జునను ఏ తీరానికి చేరుప్తుందోనన్న చర్చ ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇక మేరుగు నాగార్జున చేసిన ఘనకార్యం విషయానికి వస్తే… జగన్ సెకండ్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్న నాగార్జున… రెండేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. ఈ క్రమంలో తనను ఆశ్రయించిన ఓ మహిళకు ఆమె అడిగిన పని చేసి పెడతానంటూ ఏకంగా రూ.90 లక్షలు తీసుకున్నారట. అంతేనా… ఈ క్రమంలో ఆమెపై నాగార్జున నాలుగు పర్యాయాలు అత్యాచారం కూడా చేశారట. సరే… మంత్రి పదవిలో ఉన్న నేతను ఢీకొనడం కష్టమేనని భావించిన బాధితురాలు కనీసం తాను ఇచ్చిన రూ.90 లక్షలనైనా తిరిగి వసూలు చేసుకుందామని భావించారట.

ఈ క్రమంలో తనను డబ్బులు అడిగిన బాధితురాలపై నాగార్జున రివర్స్ బెదిరింపులకు పాల్పడ్డారట. డబ్బుల కోసం మళ్లీ తన వద్దకు వస్తే… స్లో పాయిజన్ ఇచ్చి మరీ లేపేస్తానని బెదిరించారట. దీంతో బెంబేలెత్తిపోయిన సదరు మహిళ… ఇక లాభం లేదని గ్రహించి నేరుగా తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారట. పోలీస్ స్టేషన్ కు వెళుతున్న సందర్భంగా నాగార్జున పీఏ తనతో మాట్లాడిన ఫోన్ సంభాషణలు, తాను నాగార్జునకు ఇచ్చిన డబ్బులకు సంబంధించిన ఆధారాలను అన్నీ తీసుకుని  వెళ్లి మరీ బాధిత మహిళ ఫిర్యాదు చేశారట. ప్రస్తుతం పోలీసులు సదరు ఆధారాలను పరిశీలించే పనిలో ఉన్నట్లు సమాచారం.

అంతేకాకుండా సదరు మహిళ ఇచ్చిన ఆధారాలు సరైనవేనా, లేదా? అన్న కోణంలోనూ పోలీసులు పరిశీలన చేస్తున్నారట. ఇదిలా ఉంటే… ఈ విషయం తెలుసుకున్న నాగార్జున తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి తప్పుడు ఆరోపణలను సృష్టిస్తున్నారని వాపోతున్నారట. పనిలో పనిగా గతంలో ఓ గిరిజన టీచర్ ను కూడా ఇలాగే లోబరచుకున్న నాగార్జున… ఆమెను ఏకంగా తుదముట్టించారని కూడా బాధిత మహిళ పోలీసులకు చెప్పారట. దీంతో ఆ గిరిజన మహిళ ఎవరు?.. ఆ ఘటన వివరాలేమిటి? అన్న దానిపైనా పోలీసులు ఆరా తీయడం మొదలెట్టారట.

Related posts

శివోహం: కిటకిటలాడుతున్న కడప జిల్లా శైవక్షేత్రాలు

Satyam NEWS

విశాఖ ఉక్కు ఉద్యమంలో ఇక చురుకుగా జనసేన పార్టీ

Satyam NEWS

వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం ప‌రిశీల‌న‌

Sub Editor

Leave a Comment