40.2 C
Hyderabad
April 19, 2024 15: 32 PM
Slider జాతీయం

పంజాబ్ లో కెప్టెన్‌, కమలం మధ్య పొత్తు

పంజాబ్‌లో కెప్టెన్‌-కమలం పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇరుపార్టీల నేతలు సంయుక్తంగా ప్రకటించారు.

 పంజాబ్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా బీజేపీ..ఇతర పార్టీలను కలుపుకొని ముందుకెళ్తోంది. తాజాగా బీజేపీ-అమరీంద్‌సింగ్‌ నేతృత్వంలోని పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు కుదిరింది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయాలని నిర్ణయించాయి. బీజేపీతో పొత్తు ప్రయత్నాల్లో భాగంగా కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ కేంద్ర మంత్రి…పంజాబ్‌ బీజేపీ ఇంఛార్జ్‌ గజేంద్రసింగ్‌ షేకావత్‌తో భేటీ అయ్యారు. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకోవాలని డెసిషన్‌కి వచ్చారు.

మొత్తం ఏడు రౌండ్ల చర్చల తర్వాత ఇద్దరి నేతల మధ్య క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కేంద్ర మంత్రి…సీనియర్‌ నేత గజేంద్రసింగ్ షేకావత్‌ స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటు అంశాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

Related posts

మండపేటకు 16న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాక

Satyam NEWS

సిఎం వైఎస్ జగన్ తో ఆకేపాటి భేటీ

Satyam NEWS

నిజాయితీగా వ్యాపారం చేయకపోతే చర్యలు

Bhavani

Leave a Comment