27.7 C
Hyderabad
April 24, 2024 09: 31 AM
Slider విజయనగరం

పోలింగ్ కేంద్రాల వ‌ద్ద మీడియాతో దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌కండి

#RajakumariIPS

నాల్గొ విడ‌త పంచాయితీ ఎన్నిక‌ల బందోబ‌స్తు సంద‌ర్భంగా  మొత్తం 296 పంచాయితీల‌లో ఈ నెల 21 పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

ఈ మేర‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ బ్యారెక్స్ లో ఎన్నిక‌ల‌లో పాల్గొననున్న సిబ్బంది నుద్దేశించి ఎస్పీ  రాజ‌కుమారీ…పోలింగ్ సంద‌ర్బంగా సిబ్బంది నిర్వ‌ర్తించాల్సిన‌,వ్య‌వ‌హ‌రించాల్సిన సున్నిత‌మైన  పాయింట్ల  గురించి .మెన్ ను ఉద్దేశించి మాట్లాడారు.

అనంత‌రం ఎస్పీ..త‌న‌ను క‌లిసిన‌ మీడియాతో మాట్లాడుతూ….స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల‌లో గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేసామ‌న్నారు. స్పెష‌ల్ పార్టీతో,రోబో పార్టీని పెట్టామ‌ని ఎస్పీ తెలిపారు. దాదాపు 2 వేల 284 మంది సిబ్బందితో బందోబస్తు పెట్టామ‌ని…పోలింగ్ ముగిసిన వెంట‌నే సిబ్బంది అంతా అక్క‌డే ఉండాల‌న్నారు.

అర‌గంట  వ్య‌వ‌ధిలో కౌంటింగ్ ప్రారంభ‌మ‌య్యేలా చూడాల‌న్నారు.3 వ విడ‌త పోలింగ్ సంద‌ర్బంగా మీడియా ప్ర‌తినిథుల‌ను అడ్డుకున్న విషయాన్ని వారంతా ఎస్పీ వ‌ద్ద ప్ర‌స్తావించారు.

అనంత‌రం ప్ర‌త్యేకించి సిబ్బంది యావ‌న్మందితో డ‌యాస్ మీద నుంచే పోలింగ్ కేంద్రాల వ‌ద్ద మీడియా తో ఎవ్వ‌రూ దురుసుగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని…పోలింగ్ కేంద్రాల వద్ద మీడియాను స్థానిక ప‌రిస్థితుల బట్టి అనుమ‌తించాల‌ని ఎస్పీ  తెలిపారు.

Related posts

కరోనా చికిత్సలో కొత్త ప్రోటోకాల్ పూర్తి వివరాలు ఇవి

Satyam NEWS

ఉపాధి హామీ కూలీలకు పెరిగిన వేతనం

Satyam NEWS

కేటీఆర్… అసలు నీకు వ్యాక్సిన్ అంటే తెలుసా???

Satyam NEWS

Leave a Comment