హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ లో పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు నేడు అరెస్టు చేశారు. ఈ నెల నాలుగో తేదీన ఆర్టీసీ క్రాస్రోడ్లో పుష్ప టు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కి సలాటలో ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో సంధ్యా థియేటర్ యజమాని మేనేజర్ సెక్యూరిటీ మేనేజర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు
previous post