33.2 C
Hyderabad
April 26, 2024 01: 48 AM
Slider మహబూబ్ నగర్

అల్లూరి సీతారామరాజు 123వ జయంతి వేడుకలు

#Alluri Seetharamaraju

కొల్లాపూర్ పట్టణంలోని అల్లూరి సీతారామరాజు యువజన స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 123వ జయంతి వేడుకలు నిర్వహించారు.  అల్లూరి సీతారామరాజు విగ్రహాన్నికి పూలమాలలు వేసి సంస్థ అధ్యక్ష, కార్యదర్శిలు పి.సత్యనారాయణ, వెంకటయ్యలు  నివాళులర్పించారు.

అల్లూరి సీతారామరాజు చూపిన ధైర్య సాహసాలను కొనియాడారు.  విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి, ఈయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం, సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. 

కేవలం 27 ఏళ్ళ వయసులోనే బ్రిటిషు సామ్రాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాడు.  మన అల్లూరి సీతారామరాజు మన దేశం కోసం. ప్రాణాలు అర్పించిన మహోజ్వల శక్తి అని అల్లూరి సీతారామరాజు యువజన సేవా సంస్థ అధ్యక్ష, కార్యదర్శి…పి.సత్యనారాయణ, వెంకటయ్య కొనియాడారు.  ఈ కార్యక్రమంలో రాకేష్, శ్రీను, భారత్, ఫోటో స్టూడియో బాబు, కురుమూర్తి, మల్లేష్, శివ, పవన్ మొదలగు వారు పాల్గొన్నారు.

Related posts

పూల డెకరేషన్లో పచ్చి విషం

Bhavani

అక్షరాశృతర్పణం

Satyam NEWS

రాజ్‌ కందుకూరి చేతుల మీదుగా ‘నాతో నేను’ టీజర్‌ విడుదల

Bhavani

Leave a Comment