37.2 C
Hyderabad
April 19, 2024 14: 40 PM
Slider నిజామాబాద్

ఆర్మూర్ లో అల్లూరి సీతారామరాజు 96వ వర్ధంతి

#Armoor PDSU

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 96 వ వర్ధంతి సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం PYL, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU ఆధ్వర్యంలో ఆర్మూర్ కుమార్ నారయణ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలో అల్లూరి విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా PYL రాష్ట్ర నాయకులు  సుమన్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మన్యం ప్రాంత గిరిజనులు ఆదివాసీలను కూడగట్టి వాళ్లకు విద్యను, యుద్ధ నైపుణ్యాలను నేర్పి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పై సాయుధ పోరాటాన్ని నడిపాడని కొనియాడారు.

నిరక్షరాస్యులైన మన్యం ప్రజలను దోపిడీ చేస్తున్న బ్రిటిష్ పాలకులను ఎదిరించి నిర్బంధాన్ని ఎదుర్కొని 27 ఏళ్ల ప్రాయంలోనే దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అల్లూరి సీతారామరాజు స్పూర్తి తో నేటి విద్యార్థి యువతరం ఈ దేశాన్ని దోచుకుంటున్న స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు.

అనంతరం వేగం గ్రామ సర్పంచి సరోజా గంగా రెడ్డి , అనూష శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అడుగు జాడల్లో నేటి విద్యార్థి యువతరం నడవడమే అల్లూరి కి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.  ఈ కార్యక్రమంలో PYL డివిజన్ కార్యదర్శి నిమ్మల నిఖిల్, PDSU ఏరియా కార్యదర్శి దేమొల్ల నిఖిల్, దేగాం ప్రభు ,తూర్పటి శ్రీనివాస్,ఈశ్వర్, శంకర్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Related posts

పేదవారికి కూడా రుణాలు అందేలా చేసిన ఇందిరమ్మ

Satyam NEWS

ఉద్యోగులకు బిజెపి పూర్తి మద్దతు

Satyam NEWS

ఫాక్ట్ ఫైండింగ్: ధాన్యం అమ్మే రైతులకు సౌకర్యాలు లేవు

Satyam NEWS

Leave a Comment