తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబరు 13వ తేదీ శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర జరుగనుంది. ఈ ఆలయంలో డిసెంబరు 4 నుండి శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం జరుగుతోంది. సాత్తుమొర సందర్భంగా డిసెంబరు 13న సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆళ్వారుల పరంపరలో ఆఖరి వాడైన శ్రీ తిరుమంగై ఆళ్వార్‌ను శ్రీవారి ధనుస్సు అయిన సారంగి అంశ అంటారు. తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే భువిలో ఉన్న నూట ఆరు దివ్యదేశాలను సందర్శించారని వారి శిష్యుల మాట. స్వామివారిని కీర్తిస్తూ వెయ్యికి పైగా పాశురాలను గానం చేసాడు.
previous post