28.7 C
Hyderabad
April 24, 2024 06: 42 AM
Slider ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోడీతో భేటీకి కదలిన రాజధాని రైతులు

amaravathi farmers

రాష్ట్ర ప్రభుత్వం మంకుపట్టుతో తమ గోడు పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరేందుకు రాజధాని అమరావతి రైతులు సమాయత్తం అయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీ కి వారు బయలుదేరారు. రాజధాని రైతులు గత 45 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనీసం వారివైపు కన్నెత్తి కూడా చూడని విషయం తెలిసిందే.

దాంతో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లేందుకు జేఏసీ నిర్ణయించింది. జేఏసీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా తో పాటు 10 మంది కేంద్రమంత్రులను రైతులు కలవనున్నారు. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని  మూడు రాజధానులు వద్దంటూ తమ గోడును కేంద్రానికి వారు విన్నవించబోతున్నారు.

Related posts

శ్రీ‌వారి ఆల‌యం నుండి అమ్మవారికి సారె

Murali Krishna

తిరుపతి పవిత్రతకు “విఘాతం” కలిగించకండి

Satyam NEWS

వైసీపీ ఎమ్మెల్యే దూషణలతో మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment