రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్న సినీ నటులు అమరావతికి జరుగుతున్న అన్యాయం పై ఇప్పటి వరకూ మాట్లాడకపోవడం శోచనీయమని అమరావతి రైతులు అంటున్నారు. తెలుగు సినీ నటులు అమరావతికి అనుకూలంగా ఇప్పటికైనా ప్రకటన చేయాలని అమరావతి రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు సినీ హీరోలు మొహంచాటేసి ముఖ్యమంత్రులకు భయపడుతూ కూర్చుంటున్నారని, దీనివల్ల వారి అభిమానులకు అన్యాయం జరుగుతున్నదని వారు అంటున్నారు. ఆస్తుల కోసం, సినిమా స్టూడియోలకు స్థలాల కోసం తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే పట్టింకోవడం మానేస్తారా అని వారు ప్రశ్నించారు. అమరావతి రైతులు నేడు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అమరావతిలోనే రాజధాని ఉంచాలని, ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అవసరం లేదని వారన్నారు.
previous post