28.2 C
Hyderabad
April 20, 2024 12: 06 PM
Slider ఆంధ్రప్రదేశ్

రిమెంబెర్ ఇట్: మేము రైతులం నేరస్తులం కాదు

amaravathi jac

రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు.144 సెక్షన్‌, 30 యాక్ట్‌ అమల్లో ఉన్నందున ఎవరూ బయటకు రావొద్దంటూ పోలీసులు మైక్‌లో ప్రకటించారు. గ్రామాల ప్రధాన కూడళ్లలో ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతులు బయటకు రాకుండా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. నెక్కల్లు గ్రామంలోకి మూడు జీపుల్లో వచ్చిన పోలీసులు గ్రామస్థులకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. తాము రైతులమని గ్రామంలో నేరస్థులు ఎవరూ లేరని నోటీసులు తీసుకునేందుకు గ్రామస్థులు నిరాకరించారు.

రాజధాని అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో  పూజలు నిర్వహించి అనంతరం పొంగళ్లను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలని రైతులు నిర్ణయించారు. ఈక్రమంలో పలువురు రైతునాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు ఇవాళ రైతులు నిర్వహించతలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

తుళ్లూరులో 10 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  తుళ్లూరులో రహదారిపై ధర్నా, టెంట్‌ వేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ఆందోళనల్లో పాల్గొనకుండా పలువురు తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, విజయడలో తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందు తదితరులను గృహనిర్బంధం చేశారు

Related posts

Sale Monster Test Pills

Bhavani

సెలూన్ హెయిర్ క్రష్ లో సెలెబ్రిటీల సందడి

Satyam NEWS

బిజెపి పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

Satyam NEWS

Leave a Comment