29.2 C
Hyderabad
September 10, 2024 16: 51 PM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

కొన్న భూములు కాపాడుకోవటం కోసం…

Amaravathi

రాజధాని రైతుల పేరుతో జరుగుతున్న ఆందోళనలో రైతులకంటే ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు  చేసి అడ్డదారిలో వేల  కోట్ల రూపాయల ఆస్తులకు పడగలెత్తిన రాజకీయ నాయకుల హడావుడే ఎక్కువ కనిపిస్తున్నది. శివరామకృకష్ణన్ కమిటీ సిఫార్సులను ప్రస్తావించిన మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలుఫై రాధాంతం చేసిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు బిజెపిలోకి వెళ్లిన పాత తెలుగుదేశం వారిని కూడా రంగంలోకి దించారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోక ముందే రాజధాని రైతులలో ఆందోళన వ్యక్తం అవుతున్నట్లు భూత అద్దంలో చూపించటం వెనుక అసలు రహస్యం మరొకటి దాగి వుంది. రాజధాని మార్పు జరుగుతుందని ఊహాగాన వార్తలు వెలువడిన వెంటనే రాజధాని ప్రాంతంలో రియల్ వ్యాపారం బాగా పడిపోయి, హైదరాబాద్ లో 30శాతం పెరిగాయని మాజీ ముఖ్యమంత్రి సిబి నాయుడు చెప్పిన వెంటనే రాజధాని రైతులు పేరిట కొంతమంది హైదరాబాద్ బాట బట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది.

ఆదివారం హైదరాబాద్  కు వచ్చిన రైతులు కొంతమంది ఆంధ్రా నాయకులను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఎన్నికలలో జనం చేతిలో ఘోర పరాజయం చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను, కేంద్రమంత్రి పదవి పోయిన వెంటనే తనపై నమోదు అయిన కేసుల నుంచి బైటపటడానికి ఎన్నికలు అనంతరం భారతీయ జనతా పార్టీ లో చేరిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిలను కలవటంలో ఒక పెద్దాయన రాజకీయ చతురత కొట్టవచ్చినట్లు కనబడుతోంది. రైతులకు సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలని వారు తమ దగ్గరలో గల నేతలను కలుస్తారు. కానీ వ్యయ ప్రయాసలకు తట్టుకొని హైదరాబాద్ వెళ్లి ఈ ఇద్దరు ప్రముఖ నేతలను కలవటం వారు వారికి సంఘీభావం తెలపటం దానిని పచ్చ మీడియా రచ్చ చేయటం చూస్తుంటే “పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ లోకానికి తెలియదులే అని భావించిన”  సామెత గుర్తుకు వస్తోంది.

రైతులకు అండగా ఉండి పోరాడుతానని స్పష్టం చేసిన చంద్రబాబు మరి ఇప్పుడు ఈనెల 30,31 తేదీలలో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెబుతున్న  జనసేన నేత పవన్ కళ్యాణ్ కు సంఘీభావం తెలుపుతారో లేదో వేచిచూడాలి. ఇది ఇలావుంటే సుజనా చౌదరి రైతులను ఓదారుస్తూ రాజధాని తరలింపు వుండదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముక్తాయించారు. రాజధాని రైతులు నేరుగా ముఖ్యమంత్రి ని కలవాలని ఆయన న్యాయం చేస్తారని సెలవు ఇస్తూ రైతులకు భారతీయజనతా పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రాజధాని ప్రాతనంలో తనకు భూములు లేవని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో నాయుకులు పేరుమీద భూములు లేవు వాళ్ళ బినామీల పేరుమీద మాత్రం ఉన్నాయన్నది నగ్న సత్యం.

అదేవిధంగా గుంటూరు లో తనను కలిసిన రైతులకు భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తనదైన రీతిలో భరోసా కల్పించారు. రాజధాని మార్పు అనివార్యమని ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. మంత్రి బొత్స వ్యాఖ్యల తరువాత మాట్లాడిన రాష్ట్ర మంత్రులు కానీ,అధికారపార్టీ నాయుకులు కానీ అమరావతి మార్పు లేదని కుండ బద్దలు కొట్టారు. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వచ్చిన తరువాత ఆయన ప్రకటన చేస్తే దానిపై ఎవరు ఉద్యమాలు చేసినా, దానిపై ప్రకటనలు చేసిన పరవాలేదు. కానీ ఏమి జరగక ముందే ప్రమాదం ముంచుకొచ్చినట్లు, రైతులకు అండగా ఉన్నట్లు ప్రసార మాధ్యమాల్లో చెవులకు చిల్లు పడేటట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు.

ఇక్కడ  భూములు రేట్లు తగ్గిపోయి “దొనకొండ” ప్రాంతాల్లో ధరలు పెరిగిపోయాయని, హైదరాబాద్లో పెరిగిపోయాయని తెగ బాధ పది పోతున్నారు. అసలు వేలాది ఎకరాలు సేకరించి అమరావతి రాజధానిగా ఎంపిక చేయడం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచటానికా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు,పరిశ్రమలు నెలకొల్పుతామని 100 నుంచి 500 ఎకరాలు వరకు చాలామంది ప్రభుత్వం నుంచి భూములు పొందారు. వారిలో ఒక్కరు కూడా ఇంతవరకూ తమ సంస్థలు ఎందుకు ప్రారంభించలేదు అన్న ప్రశ్నలకు మాజీ నేతల నుంచి సమాధానంలేదు. కేంద్రం నుంచి రాజధాని నిర్మాణానికి నిధులు అందలేదని చంద్రబాబు అమరావతిలో చెబితే దానిని జాతీయ మీడియాలో ప్రచారం చేసే బాధ్యతను సుజనా చౌదరి అప్పటిలో నిర్వర్తించేవారు.

అయితే ఆదివారం భారతీయ జనతా పార్టీ నేతగా హైదరాబాద్ లో సుజనా చేసిన ప్రకటన ఆయన రెండు నాల్కుల ధోరణికి అద్దం  పడుతొంది. దేశంలో రాజధానుల నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇవ్వదని, ప్రత్యేక ద్రుష్టి తో చూడటంతోనే రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చిందని తాజాగా సెలవు ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉండగా మోడీ నిధులు ఇచ్చివుంటే అప్పట్లో బాబు సుజనా చేసిన ప్రకటను బూటకమని కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే మోడీని నిందించారని ప్రజలు భావించాల్సి ఉంది. ఇప్పుడు చేస్తున్న రాద్ధాంతాన్ని చూస్తుంటే ఒకవేళ ప్రభుత్వం రాజధానిలో ఏవిధమైన మార్పు లేదని ప్రకటిస్తే తాము ఉద్యమం చేస్తామంటేనే ప్రభుత్వం నిర్ణయం మార్చుకుందని పచ్చమీడియా ద్వారా ప్రచారం పొందవచ్చు.

ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం మార్పు వైపు వెళితే రైతులు నష్ట పోయారు అని ప్రచారం చేసుకోవచ్చు అన్న ఆలోచన కాక మరొకటి కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ రైతులు భూములు పోగొట్టుకొని ఇప్పటికే నష్ట పోయారు. ఇప్పుడు రాజధాని మారినా, మారకపోయినా రైతులకు నష్టం జరిగిపోయింది. అందుకే గత ఎన్నికలలో రాజధాని ప్రాంతంలో గల తాటికొండ , మంగళగిరి నియోజకవర్గాలలో అప్పటి అధికార పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం అధికార పార్టీ పై ఏదోవిధం గా బురద జల్లడానికి ప్రతిదీ రాజకీయం చేయటం జరుగుతున్నది.

ramakrishna-mutnuru-1
ముట్నూరు రామకృష్ణ              

Related posts

మొక్కలు నాటిన రామగుండం పోలీస్ కమీషనర్

Satyam NEWS

నిందితులకు శిక్ష పడే విధంగా పని చేయాలి

Satyam NEWS

తొలి రోజు ఓకే…. ఇక రాత్రి రోడ్లపైకి వస్తే జరిమానా తప్పదు

Satyam NEWS

Leave a Comment