రిపబ్లిక్ డే గణతంత్ర ఉత్సవాలను పురస్కరించుకొని ఢిల్లీలోని కర్తవ్య పథ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనకాపల్లి నుంచి చెక్క బొమ్మల తయారీతో శకటం పంపిందని, దీనికి బదులుగా ప్రజా రాజధాని అమరావతి శకటం పంపి ఉండాల్సిందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల విశిష్టతలను తెలియజేస్తూ, రిపబ్లిక్ పెరేడ్ కు శకటాలను పంపే ఆనవాయితీ ఉందని రాష్ట్ర ప్రభుత్వం వినాయకుడు, వెంకటేశ్వరస్వామి, హరిదాసు, బొమ్మల కొలువు, పిల్లల ఆటపాటలతో కూడిన చెక్క తయారీ శకటాన్ని పంపిందని చెప్పారు. దీనికి బదులుగా రాజధాని కోల్పోయిన రాష్ట్రానికి రైతుల భాగస్వామ్యంతో అమరావతి నిర్మాణం, రాజధాని విధ్వంసానికి వ్యతిరేకంగా 16 31 రోజుల రైతుల ఉద్యమ స్ఫూర్తిని తెలియజేస్తూ అమరావతి శకటం పంపి ఉండాల్సిందని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.
previous post