Slider జాతీయం

అమర్ నాథ్ యాత్రలో పాక్ కుట్ర… భగ్నం

amarnath yatra

అమరనాథ్  యాత్ర ను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ పెద్ద ఎత్తున కుట్ర పన్నినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. జమ్ముకాశ్మీర్ లో భారీగా భద్రతా దళాలు మోహరించడం తో చాలా మందిలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎందుకు ఇలా భద్రతాదళాలను మోహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆర్మీ, పోలీసు అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు అమరనాథ్ యాత్రలో అలజడి సృష్టించాలని ప్రయత్నించారని చినార్ కార్స్ప్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ దిల్లాన్ తెలిపారు. దీనికి సంబంధించి తమకు సమాచారం అందిందని.. వెంటనే సోదాలు నిర్వహించామని వారు చెప్పారు. ఈ కుట్రకు పాకిస్తాన్ ఆర్మీకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పక్కా ఇంటిలిజెన్స్ సమాచారం అందడంతో ముందుగానే సోదాలు చేపట్టి వారి కుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్‌ ఆయుధ కర్మాగారంలో తయారైన మైన్లు లభించడం ఇందుకు సాక్ష్యమని ఆర్మీ అధికారులు తెలిపారు. అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో అమెరికా ఎం-24 స్నిపర్‌ సహా పలు రైఫిళ్లు, ఈ మార్కు ఉన్న పలు మైన్లు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టంచేశారు.

Related posts

నేరాల అదుపునకు.. నిఘా నేత్రాలు ఉపయోగకరం

Satyam NEWS

మాస్కులు పంపిణీ చేసిన సీఎల్ పి నేత భట్టి

Satyam NEWS

సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్

mamatha

Leave a Comment

error: Content is protected !!