28.7 C
Hyderabad
April 25, 2024 06: 12 AM
Slider ప్రత్యేకం

రామోజీ ఫిల్మ్ సిటీలో వేసేవి కేసినోలా.. క్యాబరేలా.. బెల్లీ డ్యాన్స్ లా..?

#ambatirambabu

‘‘నాకు తెలియక అడుగుతున్నా…. మీకు కొన్ని డ్యాన్సులు చూపిస్తాను. ఇవి ఎక్కడ వేశారంటే.. ఎవరు వేశారంటే.. రామోజీ ఫిల్మ్‌ సిటీ లో జరిగిన ఈవెంట్స్‌కు సంబంధించిన డ్యాన్సులు ఇవి.. అంటూ అందుకు సంబంధించి వీడియో క్లిప్సింగ్స్‌ మీడియా ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రదర్శించారు. ఈ డ్యాన్సులు గుడివాడలో కాదు… లేకుంటే శ్రీకృష్ణదేవరాయుల ఆస్థానంలో కాదు. గగ్గోలు పెట్టికల్చర్స్‌ గురించి మాట్లాడే టీడీపీ వాళ్లందరికీ మనవి చేస్తున్నదేమిటంటే… ఇవన్నీ మీ రాజ గురువు గారు రామోజీరావుగారి  ఫిల్మ్ సిటీలో వేశారు.

ఇది కేసినో కాదు.. క్యాబరే డ్యాన్సు. కేసినో కాదు బెల్లీ డ్యాన్స్‌. ఇవన్నీ ఇండియాలో తెలియదా? ఏమైంది మీ సంస్కృతి. రామోజీరావుగారు కూడా గుడివాడ సమీపంలోనే పుట్టారు. ఏమైంది ఆయన సంస్కృతి అని అడుగుతున్నాం. కొడాలి నానిని అడుగుతున్న టీడీపీ వాళ్లు అంతా వెళ్లి 365 రోజులు క్యాబరే నడుపుతున్న రామోజీరావుగారిని నిలదీయగలరా అని అడుగుతున్నా? ఆయన్ని నిలదీయలేరు? ఎందుకంటే మీకు బాగా సన్నిహితం, ఆయనను ఏమీ అనంకానీ, అదే నాని మాకు వ్యతిరేకం, రోజు మా మీద విమర్శలు చేస్తున్నాడు కాబట్టి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలి, ఉరి వేయాలి, వెయ్యి కొరడా దెబ్బలు కొట్టాలి అని మాట్లాడతారా..?.

సంక్రాంతి సందర్భంగా మూడు రోజులు ఏదో ఎక్కడో జరిగితే నానికి అంటకడతారా? ఆ సమయంలో నాని ఎక్కడనున్నాడు? కరోనా వచ్చి హైదరాబాద్‌ హాస్పటల్‌లో ఉంటే.. నానిగారి ప్రాంగణంలో జరిగిందని కాసేపు, కాదు ఆ ప్రాంగణం పక్కన జరిగిందంటూ.. నానిగారి ఊరిలో జరిగిందని కాసేపు, వైయస్సార్‌ సీపీవాళ్లు జరిపారని కాసేపు… ఇన్ని రకాలుగా నాలుక మడతేస్తారా.. ఇవన్నీ ఏంటి? మీకేమీ పనిలేదా? ఆ మూడు రోజులు ఎవడో ఎక్కడో కోడి పందేలు వేస్తేనో.. ఎవడో డ్యాన్సులు వేస్తేనో పట్టుకోవాల్సిందే. పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే.. మా సంస్కృతి, సంప్రదాయాలు అంటూ పోట్లాడి, మీదకు వస్తున్నారే? చట్టం నుంచి జారిపోతున్నారే? ఏమిటీ అన్యాయం అని అడుగుతున్నాం? అని అంబటి రాంబాబు అన్నారు.

Related posts

దేశాన్ని సంరక్షిస్తున్న జవాన్లకు సెల్యూట్

Satyam NEWS

భద్రాద్రి రూట్ మాప్

Murali Krishna

ఖమ్మం జిల్లా మధిరలో ముగిసిన క్రికెట్ పోటీలు

Satyam NEWS

Leave a Comment