39.2 C
Hyderabad
April 25, 2024 17: 59 PM
Slider గుంటూరు

అంబేద్క‌ర్ బాట‌లోనే యువ‌త ప‌య‌నించాలి

ambedkar 64 Anniversary

ఈ దేశ ముఖచిత్రాన్నితన రాజ్యాంగం ద్వారా మార్చిన మహనీయుడు అంబేద్కర్ అని ఆ మ‌హానీయుని మాల మ‌హానాడు నేత‌లు పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం బాపనయ్యనగర్ లో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా మాలమహానాడు ఆధ్వర్యంలో ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా మాలమహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోదాజాన్ పాల్ మాట్లాడుతూ ఈ దేశంలో వేల సంవత్సరాలుగా అస్పృశ్యులుగా అంటరానివారుగా ఊరికి దూరంగా నెట్టవేయబడిన జాతుల‌ పక్షాన ఆహర్నిశలు కష్టపడి అణగారిన వర్గాల తోపాటు ఈ దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్నిదేశాల రాజ్యాంగం కన్నాభారతదేశ రాజ్యాంగం సార్వ సౌభ్రాతృత్వం కలిగిన రాజ్యాంగంగా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన రాజ్యాంగంగా ఉండాలని అతిపెద్ద రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ దేశ రాష్ట్ర పాలకులు రాజ్యాంగాన్నిఅనుసరించి పరిపాలన చేస్తూ రాజ్యాంగం రాసిన మహనీయుని ఆశయాలను తుంగలో తొక్కుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. యువత అంబేద్క‌ర్ చూపించిన దారిలోనే న‌డ‌వాల‌ని దేశ‌ భవిష్యత్తులో కీల‌కంగా మారాల‌న్నారు.

ఈ వర్ధంతి వేడుకల్లో భూమి రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ముస్లిం సంఘం నాయకులు కాశీంపీరా, ఎమ్మార్పీఎస్ నాయకులు చిరు గుారీ నాగరాజు, సండ్ర వెంకట కాళ్లగడ్డ, రమేష్ చింతల, కామేశ్వరరావు దాసరి, శ్రిను, ఎడవల్లి ప్రభుదాసు, సుభానీ, చింతల వెంకటేశ్వర్రావు, ప్లంబర్ రవి, చావ మహేష్, బబ్బులు జానీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముందు నుండి వైసిపి, వెనుక నుండి బిజేపి వెన్నుపోటు

Satyam NEWS

మిడిల్ మెన్:భారత్ పాక్ ల చర్చలకు నేపాల్ మధ్యవర్తిత్వం

Satyam NEWS

నీట్, జేఈఈ ప్రాక్టీస్ టెస్ట్స్ సిద్ధం

Sub Editor

Leave a Comment