బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ లోని టెంపుల్ బస్ స్టాప్ వద్ద బిజెపి పార్టీ114 డివిజన్ కన్వీనర్ ఎన్. గురు ప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్ పల్లి ఏసీపీ శ్రీనివాస్ రావు, బిజెపి కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ మాధవరం కాంతారావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావులు ముఖ్యఅతిథిలుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన భారత రాజ్యాంగానికి ప్రధాన రూపశిల్పి, స్వతంత్య్ర భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, దేశంలోనే ప్రముఖ న్యాయనిపుణుడిగా, ఆర్థికవేత్తగా, సంఘ సంస్కర్తగా అంబేద్కర్ ఎంతో ప్రసిద్ధిగాంచారని గుర్తుచేశారు. అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి అని, పేద, బడుగు బలహీనులకు రాజ్యాంగ పరంగా అనేకచట్టాలు తెచ్చి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. సామాజిక న్యాయం కోసం జరిగే సమరశీల పోరాటాలపై చెరగని ముద్రవేసిన బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
