34.2 C
Hyderabad
April 19, 2024 19: 30 PM
Slider ఖమ్మం

ఖమ్మంలో ఘనంగా అంబెడ్కర్ జయంతి ఉత్సవం

#ministerpuvvada

భారత రత్న డా.బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకుని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు.

ఖమ్మం అంబెడ్కర్ సెంటర్ లో ఎస్సి, అంబెడ్కర్ అభిమాన సంఘాల విజ్ఞప్తి మేరకు పాత జడ్పీ సెంటర్ లో అంబెడ్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నేడు అంబెడ్కర్ జయంతి సందర్భంగా వారి 14 అడుగుల విగ్రహాన్ని మంత్రి పువ్వాడ  ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీడిత వర్గాల కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. భారత రత్న, రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 130 వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.

అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, పీడిత ప్రజల బాగు కోసం,బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వెలుగు నింపడం కోసం డా.బి.ఆర్ అంబేద్కర్ చూపించిన బాటలో వారిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు అదే బాటలో సాగుతున్నారన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన బాటలోనే మనమందరం కూడా నడిచి పేదవారి ఆకలి తీర్చడం కోసం, బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పనిచేయడమే  వారికి నిజమైన నివాళి అన్నారు.

నేటి నుండి జడ్పీ సెంటర్ ను అంబెడ్కర్ సెంటర్ గా నామకరణం చేశారు. ఇక నుండి ఇలానే పిలవాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో 90శాతం ఉన్న బడుగుబలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే, డా.బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి నిజమైన గౌరవం ఇచ్చిన వారమవుతామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఖమ్మం జిల్లా కలెక్టర్ RV కర్ణన్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, ఎస్సి, ఎస్టీ, బీసీ, స్వేరోస్, అంబెడ్కర్ అభిమాన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

యువత ఓటు ప్రాధాన్యత తెలుసుకోవాలి

Bhavani

విద్యుత్  అధికారులు, కాంట్రాక్టర్లతో మహిళా రైతులు వాగ్వాదం…

Satyam NEWS

నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు

Satyam NEWS

Leave a Comment