25.2 C
Hyderabad
October 15, 2024 11: 33 AM
Slider ప్రకాశం

ఘనంగా డా.బి.ఆర్ అంబెడ్కర్ 63 వ వర్ధంతి వేడుకలు

chemakurthy

ప్రకాశం జిల్లా చీమకుర్తి లో ఏపీ ప్రజా సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఘనంగా డా.బి.ఆర్ అంబెడ్కర్ 63 వ వర్ధంతి వేడుకలు జరిగాయి. ముందుగా అంబెడ్కర్ చిత్ర పాఠానికి పూల మాల లు వేసి ఘనంగా నివాళి అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి ప్రగతిమోడల్ స్కూల్ కరస్పాండెంట్ చాన్ బాషా మాట్లాడుతూ చదువుకునే యువతీ యువకులు  రాజ్యాంగ స్ఫూర్తి తో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.

ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన భారత దేశానికీ ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని అందించిన ఘనత బి.ఆర్.అంబెడ్కర్ ది అని కొనియాడారు. అంటరానితన నిర్మూలన కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు  డా. బి ఆర్ అంబెడ్కర్ ను  నేటి యువత  ఆదర్శంగా  తీసుకోవాలని కోరారు.

రాష్ట్ర అధ్యక్షలు కరుణాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం స్థలం సమకూర్చి చీమకుర్తి లో అంబెడ్కర్ భవన్ ఏర్పాటు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.అనంతరం ఏపీ ప్రజా సంక్షేమ సమితి అద్వర్యం లో రాజ్యాంగం గూర్చి- స్త్రీల పై జరగుతున్న హత్యాచారాలను ఎలా అరికట్టాలి అనే అంశాల పై నిర్వహించిన వ్యాస రచన ,వ్యకృత్వ పోటీలలో   గెలుపొందిన విద్యార్థులకు  ప్రధమ,ద్వీతీయ ,తృతీయ బహుమతులను అందజేశారు.

ఏపీ ప్రజా సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు కరుణాకర్ తో పాటు ఏపీ ప్రజా సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సాపాటి నాగేశ్వర రావు , రాష్ట్ర నాయకులు తన్నీరు వెంకటేశ్వర్లు, కార్యదర్శి గోసి శ్రీను, ప్రగతి మోడల్ స్కూల్ కరస్పాండెంట్ చాన్ బాషా, ఉపాధ్యాయులు, ప్రగతి మోడల్ స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, గౌతమీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

స్వామీజీ అనుగ్రహంతో అమెరికా పర్యటన దిగ్విజయంగా పూర్తి

Satyam NEWS

సందడిగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రారంభం

Satyam NEWS

మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరారు

Satyam NEWS

Leave a Comment