40.2 C
Hyderabad
April 24, 2024 16: 46 PM
Slider శ్రీకాకుళం

ట్రిబ్యూట్: మరణం లేని మహా శక్తి అంబేడ్కర్

Ambedkar SKL

మరణం లేని మహా శక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని ఎఐమ్ శ్రీకాకుళం జిల్లా ఇన్ చార్జి ,రాష్ట్ర పిఎసి మెంబర్ తైక్వాండో శ్రీను అన్నారు. దేశ సామాజిక,రాజకీయ,ఆర్థిక విధానాల నిర్ణేత ఆ మహానుభావుడన్నారు. అంబేద్కర్స్ ఇండియా మిషన్ (ఎఐమ్ ) ఆధ్వర్యంలో రాష్ట్ర కన్వీనర్ మదిరి రాంబాబు ,జోనల్ ఇన్ చార్జి సాకేటి విజయ్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రింగ్ రోడ్డులో  డా.బి.ఆర్.అంబేడ్కర్ 129వ జయంతి ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించారు.

సామాజిక దూరం పాటిస్తూ  అతి కొద్ది మంది ఎఐమ్ నేతలు సమక్షంలో ఎఐమ్ సైనిక్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను జరుపుకున్నారు. ముందుగా జిల్లా ఇన్ చార్జీ తైక్వాండో శ్రీను ,డివిజన్ ఇన్ చార్జి తాలాడ రవీంద్ర,ఎఐమ్ సైనిక్ కన్వీనర్ కళ్లేపల్లి హరి కృష్ణ,లు డా.బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

జోహార్ అంబేడ్కర్ ,అంబేడ్కర్ ఆశయాలు వర్థిల్లాలి అంటూ నినాదాలు చేసారు. ఈ సందర్భంగా తైక్వాండో శ్రీను మాట్లాడుతూ  అణగారిన వర్గాల ఆరాధ్యుడు డా. బి.ఆర్ అంబేడ్కర్ అన్నారు. ఆ మహనీయుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎఐమ్ డివిజన్ ఇన్ చార్జి తాలాడ రవీంద్ర మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి డా.అంబేడ్కర్ అన్నారు. యావత్ భారతదేశానికే కాకుండా ప్రపంచంలోనే ఆదర్శనేతగా ఆయన గుర్తింపు పొందారన్నారు. అటువంటి మహనీయుడిని స్మరించుకుంటూ ఆయన చూపిన బాటలో నడుద్దామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎఐమ్ సైనిక్ జిల్లా కన్వీనర్ కళ్లేపల్లి హరికృష్ణ, లావేరు ఇన్ చార్జి పురుషోత్తం రాంబాబు, నగర సైనిక్ కన్వీనర్ యాగాటి ప్రసాద్ ,జిల్లా సంయుక్త కార్యదర్శి భుజంగరావు ,డివిజన్ కార్యదర్శి కుమార్ ,ఎచ్చెర్ల కన్వీనర్ పెయ్యల చంటి, సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వరదల నష్టాన్ని పరిశీలించెందుకు రానున్న కేంద్ర బృందం

Bhavani

గాంధీ నగర్ లక్ష్మీ గణపతి ఆలయానికిఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS

జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment