28.7 C
Hyderabad
April 20, 2024 08: 49 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి

#hujurnagar

భారత రాజ్యాంగ నిర్మాత,న్యాయ కోవిదుడు,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకై పునరంకితమౌదామని టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ.అజీజ్ పాషా అన్నారు.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 131వ, జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కార్యాలయాలలో, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా మాట్లాడుతూ న్యాయవాదిగా,ఆర్థిక వేత్తగా,రాజకీయవేత్తగా,సామాజిక సంస్కర్తగా,రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

అంటరానితనంపై అంబేద్కర్ పూరించిన సమర శంఖం నేటికీ ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతూనే ఉందని, దళితులు,మహిళలు,కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడాయన అన్నారు.స్వయం పాలనాధికారాన్ని దక్కించుకున్న ఇండియాలోని అన్ని మతాలు,తెగలు, దళితులు,గిరిజనులు, వెనుకబడిన కులాల తదితర వర్గాలకు సైతం న్యాయం జరిగేలా,వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారు అని కొనియాడారు.

కెసిఆర్‌ దళితుడిని సిఎం చేస్తానని ఇచ్చిన హామిని విస్మరించారని, గిరిజనులకు,ముస్లిం మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి కెసిఆర్ మోసం చేశారని అజీజ్ పాషా విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,సైదా మేస్త్రి,దొంతగాని జగన్,ముత్తయ్య,కాంగ్రెస్ పార్టీ అభిమానులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

యూత్ కాంగ్రెస్ లో చేరండి ప్రజా సమస్యలపై పోరాడండి

Satyam NEWS

ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

Satyam NEWS

జ‌న‌వ‌రి 11న‌ శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

Leave a Comment