31.2 C
Hyderabad
April 19, 2024 05: 10 AM
Slider విజయనగరం

రాజ్యాంగంతో అందరికి సమానత్వంను కల్పించిన మహనీయుడు అంబేద్క‌ర్

#ambedkar

భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా విజయనగరం కలెక్టరు జంక్షను వద్ద గల డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ఎస్పీ ఎం.దీపిక  పూలమాలవేసి, పుష్పాలు సమర్పించి, అంజ‌లి ఘ‌టించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు ఆరాధ్య దైవం అంబేద్క‌ర్ అని అన్నారు.

దేశంలోని అన్ని వర్గాలకు ఆదర్శమూర్తి అని  ఎస్పీ అన్నారు. ఉన్నత వర్గాల నుండి ఎన్నో వివక్షల‌ను ఎదుర్కొన్నార‌న్నారు. అయితే మొక్కవోని దీక్ష‌తో ఇబ్బందులు వచ్చినా లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేద‌ని  గుర్తు చేసారు..పోలీస్ బాస్.

ఉన్నత చదువులు చదివి, భారత దేశానికి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన మహనీయుడు డా. బి ఆర్ అంబేద్కర్ యంతిని నిర్వహించుకోవడం దేశ పౌరులుగా మనందరి బాధ్యతన్నారు. అన్ని వర్గాలకు సమానత్వం ఉండాలని, సమాన వేతనాలు ఉండాలని అందరికీ రాజ్యాంగం ద్వారా హక్కులను కల్పించారన్నారు.

మహిళలకు ఎక్కడ సమున్నత స్థానం ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుందని భావించి, రాజ్యాంగంలో మహిళలకు సముచిత స్థానంను కల్పించిన విజ్ఞానవేత్తన్నారు. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలుతో దేశంలో కుల, మత, లింగ విభేదాలు లేకుండా అందరికీ  సమానత్వంను కల్పించిన మహానీయుడు డా. బి ఆర్ అంబేద్కర్ అని ఎస్పీ కొనియాడారు.

ఆయ‌న చూపిన మార్గంలో తామంతా పునరంకితులమై, సమాజానికి, దేశానికి అవసరమైన సేవలందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉందామ‌ని జిల్లా ఎస్పీ ఎం.దీపిక అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ, విజయనగరం సబ్ డివిజన్ ఇన్ చార్జ్ అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఏఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, ఏస్బీ సీఐ రుద్రశేఖర్, వ‌న్ టౌన్ సీఐ జె.మురళి, ఆర్ఐ పి. నాగేశ్వరరావు, వ‌న్ టౌన్ ఎస్ఐ వి. అశోక్ కుమార్, ఎస్ఐ కృష్ణ వర్మ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు, పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.

విద్యాశాఖ మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ…!

రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన  బొత్స సత్యన్నారాయణ ను  విజ‌య‌నగరం  జిల్లా ఎస్పీ ఎం.దీపిక మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌నకు , వుష్ప గుచ్ఛాన్ని ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు.

మరోసారి రాష్ట్ర మంత్రి వర్గంలో పదవిని చేపట్టి,జిల్లాకు విచ్చేసిన సందర్భంగా మంత్రివర్యులు  బొత్స సత్యన్నారాయణ , ఆయన సోదరుని నివాసానికి వెళ్లారు. ఈ సంద‌ర్బంగా  జిల్లా ఎస్పీ ఎం.దీపిక మర్యాద పూర్వకంగా కలిసి మంత్రిని క‌లిసి…, పుష్పగుచ్ఛాన్ని అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్పీతో పాటు  అదనపు ఎస్పీ పి.సత్యన్నారయణ, విజయనగరం సబ్ డివిజన్ ఇన్ చార్జ్, అదనపు ఎస్పీ అనిల్ పులిపాటిలు  మంత్రినికి మర్యాద పూర్వకంగా కలిసి, పుష్ప గుచ్ఛాలను అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

“పెన్సిల్ పరిశ్రమ” తో ప్రగతిపథంలో పయనిస్తూ

Satyam NEWS

జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన బిచ్కుంద క్రీడాకారుడు

Satyam NEWS

ప్రభుత్వం తరుపున ఆదుకుంటాo

Bhavani

Leave a Comment