Slider గుంటూరు

అంబేద్కర్ విదేశీ విద్యానిధి ప్రారంభం

#chandrababunaidu

దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు డాక్టర్  బీఆర్ అంబేద్కర్ అని, ఆ మహనీయుని స్ఫూర్తితో దళితుల అభ్యున్నతి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్సీ విద్యార్ధులు విదేశాల్లో చదవాలన్న కలను మళ్లీ నిజం చేస్తామని, అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో ఎస్సీ పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు మరిన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామన్నారు.

గత పాలకులు కక్షపూరితంగా అమరావతిని నాశనం చేశారని, ప్రజల ఆశీస్సులతో ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతిని తీర్చిదుద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి దళితుల సంక్షేమానికి తెలుగుదేశం పెద్దపీట వేస్తోంది. 2002లో ముందగుడు కార్యక్రమం పెట్టాం. స్టడీ సెంటర్లు పెట్టి ఎస్సీ, ఎస్టీ పిల్లలను చదవించాం.

అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ద్వారా పేద విద్యార్థులను చదివిస్తాం. ఈ పథకాన్ని మరింత మెరుగుపరుస్తాం. గతంలో ఎస్సీ, ఎస్టీ  విద్యార్థులకు రూ. 15 లక్షలు, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ విద్యార్థులకు రూ. 10 లక్షలు ఆర్థిక సాయం చేశాం. సుమారు 7 వేల మందిని చదివించాం. ఇందుకోసం రూ. 467 కోట్లు వెచ్చించాం. 2014-2019 మధ్య 619 మంది ఎస్సీ విద్యార్థులకు,  55 మంది ఎస్టీ విద్యార్థులను చదివించాం. ఇందుకోసం రూ. 50 కోట్లు వ్యయం చేశాం. గత  ప్రభుత్వం కేవలం 430 మందినే చదివించింది.

దీన్నిబట్టి పేదలపై వారికి ఏమాత్రం ప్రేమ ఉందో అర్ధం చేసుకోవచ్చు. సబ్ ప్లాన్ తెచ్చాం. ఎస్సీ రైతుల కోసం రూ. 1,300 కోట్లు, హార్టికల్చర్ రంగంలోని ఎస్సీల కోసం రూ. 130 కోట్లు, ఇళ్ల నిర్మాణానికి రూ. 1,253 కోట్లు, గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ. 1,200 కోట్లు, జలజీవన్ మిషన్ కింద రూ. 478 కోట్లు ఖర్చు చేస్తాం.  రాష్ట్రవ్యాప్తంగా 1,241 ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో 2 లక్షల 35 వేల 600 మంది విద్యార్థులున్నారు. వారికి రూ.1,331 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రంలో 21 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి.

వారి కోసం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. మీ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి 200 యూనిట్లు వాడుకుని మిగిలింది ప్రభుత్వానికి ఇస్తే రూ. యూనిట్ కు 2.09 పైసలు ఇస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. నెలకు మీరు 100 యూనిట్లు ఇస్తే రూ. 210 రూపాయిలు మీ అకౌంట్ లో పడతాయి. ఏడాదికి రూ.2500 నుంచి 3000  వేల వరకూ అదనపు ఆదాయం వస్తుంది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఇల్లు కట్టుకునేందుకు 50 వేలు అదనంగా డబ్బు ఇస్తాం. 

ఇందుకోసం రూ. 780 కోట్లు ఇందుకు ఖర్చవుతుంది. ఏ సమాజం పురోగతి అయినా ఆ సమాజంలోని బలహీన వర్గాల పురోగతిపై ఆధారపడుతుందని అంబేద్కర్ అన్నారు. ఒక ప్రముఖ వ్యక్తికి గొప్ప వ్యక్తికి వ్యత్యాసం ఏమంటే గొప్పవ్యక్తి సమాజసేవకుడిగా ఉండేందుకు సిద్ధపడతాడు. గొప్ప వ్యక్తి కావాలంటే పేదలకు అండగా నిలబడి వారిని పైకి తేవాలి. అప్పుడు మీరు గొప్ప వ్యక్తులవుతారు. నేను ఇచ్చిన మాట ప్రకారం పేదలకు అండగా నిలబడతాను.  పేదలే దేవుళ్లు సమాజమే దేవాలయం అని చెప్పిన ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు మంచి స్థానాల్లో ఉన్నారు. 2047 నాటికి దేశంలోనే నెంబర్ వన్ స్టేట్‌గా ఏపీ నిలుస్తుంది అని ఆయన అన్నారు.

Related posts

జొన్నలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా…

Satyam NEWS

కరోనా వేళ కార్పొరేట్  సంస్థ‌లు ముందుకు రావాలి

Satyam NEWS

రాజకీయ కారణాలతో టీచర్‌ను చంపడం దారుణం: చంద్రబాబు

Satyam NEWS
error: Content is protected !!