31.7 C
Hyderabad
April 18, 2024 23: 28 PM
Slider నెల్లూరు

మహిళా సాధికారత ధ్యేయంగా అంబేద్కర్ ఆలోచనా విధానం

#vikramuniversity

బహుజన మహిళా సాధికారిత ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాల్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సాధికారతపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం పై సదస్సులో వక్తలు ప్రసంగించారు.

ముఖ్య అతిథిగా హాజరైన సైకాలజిస్ట్ పి.ఆర్ నళిని మాట్లాడుతూ స్త్రీలు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి అంబేద్కర్ ఆలోచన విధానం ఎలా ఉపయోగపడుతుందని వివరించి చెప్పారు. ప్రముఖ న్యాయవాది షేక్ షాన్‌వాజ్ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పొందుపరిచిన చట్టాల గురించి వివరించారు.

విక్రమ సింహపురి యూనివర్సిటీ రెక్టర్ ఆచార్య చంద్రయ్య మాట్లాడుతూ మహిళ విద్య గురించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన మహిళా చట్టాలను గురించి విపులంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలిపారు.

 డాక్టర్ జి భారతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పటానికి పూలమాలలు సమర్పించి విఆర్సి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఊరేగింపుగా వెళ్లారు. ఈ సదస్సులో జ్యోతి JD (rtd) ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏపీ జి మంజుల, జి స్వరూపరాణి ప్రసంగించారు.

బహుజన మహిళ సాధికారత ట్రస్ట్ ఫౌండర్ గౌడ్ రమణయ్య సారథ్యంలో ఈ సదస్సు ఘనంగా జరిగింది. విక్రమ సింహపురి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల విద్యార్థినులు  ఈ సదస్సులో పాల్గొని  వక్తలను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

Related posts

ఈ మంత్రులు ఉన్నది ఎందుకు?

Satyam NEWS

చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Pollution: ఢిల్లీలో స్కూళ్లు బంద్

Bhavani

Leave a Comment