31.7 C
Hyderabad
April 24, 2024 23: 31 PM
Slider క్రీడలు

గచ్చిబౌలి స్పోర్ట్స్ హాస్టల్లో అంబర్పేట కబడ్డీ ప్లేయర్ కు అవకాశం కల్పించండి

#srinivasagowd

అంబర్ పేటకు చెందిన కబడి ఆటగాడు ఈ.అరవింద్ కు గచ్చిబౌలిలో ఉన్న స్పోర్ట్స్ హాస్టల్లో అవకాశం కల్పించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. ఈ మేరకు సోమవారం ఆటగాడు అరవింద్ ను తీసుకొని ఆయన మంత్రి దగ్గరికి వెళ్లారు. జిల్లా రాష్ట్ర స్థాయిలో సీనియర్ కబడ్డీ ప్లేయర్గా అరవింద్ కు మంచి గుర్తింపు ఉందని చెప్పారు. స్పోర్ట్స్ కోట కింద హాస్టల్లో సీటు ఇప్పిస్తే జాతీయ స్థాయిలో కూడా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. దీనికి స్పందించిన మంత్రి వెంటనే హాస్టల్లో సీటు ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబోలు నరసింహారెడ్డి, రామారావు యాదవ్, ప్రవీణ్ పటేల్ తదితరులు ఉన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

క్లిష్ట సమయంలో నిబంధనలు అతిక్రమిస్తున్నారు…వారే

Satyam NEWS

మునిసిపాలిటీలకు భారీ ఎత్తున దాఖలైన నామినేషన్లు

Satyam NEWS

ద్వారకా తిరుమల వేదపాఠశాల విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందచేత

Satyam NEWS

Leave a Comment