రూ.40 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
కాచిగూడ డివిజన్ ఆర్టీసీ కాలనీ నుంచి రైల్వేస్టేషన్ కు వెళ్లే రోడ్డు కు ఎట్టకేలకు మోక్షం లభించింది గోల్నాక డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు, వార్డ్ కమిటీ సభ్యుడు దోర్నాల భరత్ రాజ్ ముదిరాజ్ మాట్లాడుతూ కొంతకాలంగా ఈ రోడ్డు గతుకుల మయంగా తయారై రాకపోకలకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. వాహనదారులు ప్రతిరోజు ఇక్కట్లకు గురవుతున్నారని, ఈ విషయాన్ని స్థానికులు, వాహనదారులు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ దృష్టికి తీసుకువెళ్లాగా ఆయన రోడ్డు మంజూరు చేయించారని తెలిపారు. అయితే ఆ రోడ్డు నిర్మాణం చేపట్టాలంటే ఆది రైల్వేశాఖ కిందకు వస్తుందనిఆయన తెలిపారు. అ శాఖ అనుమతి ఇస్తేనే రోడ్డు నిర్మాణం చేపట్టగాల్గుతామన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నేరుగా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంను కలిసి రోడ్ సమస్యను వివరించారు. అనుమతి కోసం జీహెచ్ఎంసీ అధికారులను రైల్వే జీఎం వద్దకు పంపించడంతో జీఎం అనుమతి ఇచ్చారు. వెంటనే అధికారులు ప్రతిపాదనలు తయారు చేయగా, రూ.40 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. సోమవారం రోడ్డు పనులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభిస్తున్నారు. ఈ పనులు పూర్తి అయితే స్థానికులు, వాహనదారుల ఇబ్బందులు తొలిగిపోనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
సత్యం న్యూస్, అంబర్పేట్