34.2 C
Hyderabad
April 19, 2024 21: 58 PM
Slider ఆదిలాబాద్

అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

#MinisterIndrakaranReddy

గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఎమర్జెన్సీ రెస్పాన్స్  ( 108 – అత్యవసర ప్రతిస్పందన) అంబులెన్స్‌ సేవలను  మంగళవారం  నిర్మల్ ఏరియా ఆసుపత్రి ఆవరణలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి  జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబులెన్స్‌ సేవలను నిర్మల్ జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు.

కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్‌ స్ల్మైల్‌ కార్యక్రమంలో భాగంగా మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి తన స్వంత నిధులతో  రూ. 61.50  లక్షలతో  3 అంబులెన్స్ లను సమకూర్చారు. ఈ వాహనాల్లో ఆక్సీజన్‌, వెంటిలేటర్‌తో సహా, అత్యాధునిక సదుపాయాలను కల్పించారు.

ఈ కార్యక్రమంలో  జెడ్పీ చైర్ పర్సన్ కె.విజయలక్ష్మి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ యువజన నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి, ఇతర స్థానిక ప్రజాప్రతినిదులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫోన్ కొనివ్వలేదని తల్లిని హత్యచేసిన కొడుకు

Sub Editor 2

ఉపాధ్యాయులు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు

Satyam NEWS

Leave a Comment