33.2 C
Hyderabad
April 26, 2024 00: 48 AM
Slider ఆదిలాబాద్

తలసేమియా పేషంట్లకు అంబులెన్సు సౌకర్యం ఉచితం

Sandeep

తలసేమియా పేషంట్ల దగ్గర ఆర్ బి ఎస్ కె వెహికల్ డ్రయివర్లు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు. సిర్పూర్ టీ హీరాపూర్ కు చెందిన నాలుగు సంవత్సరాల బాలుడు శ్రీమంత్ ను మంచిర్యాల ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ఆర్ బి ఎస్ కె వాహనానికి ఫోన్ చేశారు.

ఇంటి నుంచి మంచిర్యాల ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు డ్రైవర్ నవీన్ రూ.1800 డిమాండ్ చేశాడు. డ్రైవర్ ను అదేమని ప్రశ్నించగా తమ వెహికల్ ఓనర్ తీసుకోవాలని చెప్పినట్లు అంటున్నాడు. దాంతో శ్రీమంత్ తండ్రి రమేష్ తమకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పరిశీలన జరిపిన అధికారులు ఈ మేరకు హెచ్చరిక జారీ చేశారు.

ఆర్ బి ఎస్ కె వాహనాలకు వైద్య శాఖ చార్జీలు చెల్లిస్తుందని జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు. తలసేమియా పేషంట్లను ఉచితంగానే తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 1200 కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు.

Related posts

మన సినిమా వాళ్ళు ఇప్పటికైనా మారాలి

Satyam NEWS

ఎండ‌ను లెక్క చేయకుండా సిబ్బందిని అలెర్ట్ చేస్తున్న పోలీస్ బాస్…!

Satyam NEWS

తెలంగాణలో కరోనా బస్సులు సిద్ధం అవుతున్నాయి

Satyam NEWS

Leave a Comment