28.7 C
Hyderabad
April 20, 2024 03: 37 AM
Slider ప్రపంచం

కంఫార్మ్డ్:ఎంబసీ పై రాకెట్‌ దాడులు నిజమే

iran target embassy

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా ఆదివారం మరోసారి రాకెట్‌ దాడులు జరిగాయి. ఈ విషయాన్ని పెంటగాన్‌ అధికారులు వెల్లడించారు. గతేడాది అక్టోబరు నుంచి అమెరికా ఆస్తులపై దాడులు జరగడం ఇది 19వ సారి అని తెలిపారు. యూఎస్‌ రాయబార కార్యాలయం లక్ష్యంగా ఎన్ని రాకెట్లతో దాడి జరిగిందనే విషయం ప్రకటించలేదు.

ఈ ఘటనలో తమ సిబ్బంది ఎవరూ గాయపడలేదని అన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. అమెరికా మాత్రం ఇది కచ్చితంగా ఇరాన్‌ మద్దతుదారుల పనే అని ఆరోపిస్తోంది. కాగా, గతనెల3న బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ ఖాసీం సులేమాని కాన్వారును లక్ష్యంగా అమెరికా డ్రోన్‌ దాడికి పాల్పడింది. ఈ దాడిలో సులేమాని సహా 10 మంది మృతిచెందారు. 

Related posts

బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

Satyam NEWS

ఈ సారి పోలీసు స్పందనకు వచ్చిన ఫిర్యాదులెన్నో తెలుసా..

Satyam NEWS

అబ్దుల్ కలాం జీవితం కోట్ల మందికి స్ఫూర్తిదాయకం

Satyam NEWS

Leave a Comment