35.2 C
Hyderabad
April 20, 2024 18: 01 PM
Slider ప్రపంచం

సేవ్ ఆంధ్రప్రదేశ్:అమెరికాలోనూ అమరావతి ఆందోళనలు

america amaravathi

అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ జరుగుతున్న ఆందోళనలు అమెరికాకూ తాకాయి. రాజధాని రైతులకు మద్దతుగా అమెరికాలోని వివిధ నగరాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు  ‘సేవ్ అమరావతి.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో నిరసనలు తెలియజేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాల్సిందేనని, అయితే అధికార వికేంద్రీకరణ మాత్రం తగదని నినదిస్తున్నారు.

అంతేకాదు, వాషింగ్టన్ డీసీ, డెలావేర్, పెన్సిల్వేనియా, చికాగో, ఆస్టిన్, న్యూజెర్సీ, డెమోయిన్స్ తదితర నగరాల్లో సమావేశాలు నిర్వహిస్తూ అమరావతిపై గళమెత్తుతున్నారు. నేడు, రేపు కూడా పలు నగరాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రవాసాంధ్రులు తెలిపారు. ఏయే నగరాల్లో ఎప్పుడు సమావేశాలు నిర్వహించేదీ కార్యాచరణ ప్రకటించారు.

Related posts

అమెరికాలో రోడ్డు ప్రమాదం: సూర్యాపేటవాసి మృతి

Satyam NEWS

సీరియస్ ఎలిగేషన్: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మతి భ్రమించింది

Satyam NEWS

కరోనా కాలంలో సేవలు అందిస్తున్న మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment