39.2 C
Hyderabad
April 18, 2024 17: 15 PM
Slider ప్రపంచం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో తలతిక్క నిర్ణయం

#Donald Trump

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చైనాకు వత్తాసు పలుకుతున్నదని ఇప్పటికే చాలా సార్లు చెప్పిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చివరకు నిర్ణయం తిసుకుని దానికి గుడ్ బై చెప్పేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ  చైనా విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని, చైనాకు వత్తాసు పలికిందని ట్రంప్ ఆరోపణ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ విధంగా చేయడం లేదని, అమెరికాకు పలుమార్లు వివరణ ఇచ్చినా ట్రంప్ శాంతించలేదు. ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూహెచ్‌వో నిర్ణయాలు అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయ్యాయని ట్రంప్ ఆరోపించారు.

వైరస్ విషయంలో కీలక అంశాలను దాచిపెట్టినందుకు చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదై, తమ దేశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

Related posts

గ‌రుడ‌ వాహనంపై ఒంటిమిట్ట శ్రీ కోదండ‌‌రాముడు

Satyam NEWS

మహారాష్టలో ముదిరిన లౌడ్ స్పీకర్ ల వివాదం

Satyam NEWS

వెనక్కి తగ్గిన పళని.. అన్నాడీఎంకే సారథిగా పన్నీర్ సెల్వం

Sub Editor

Leave a Comment