అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాక్ రాజధాని బాగ్దాద్ విమానాశ్రయంపై ఈ తెల్లవారుజామున రాకెట్ లతో దాడి జరిగింది. విమానాశ్రయం కార్గోహాల్‌ను మొత్తం మూడు రాకెట్లు ఢీకొట్టాయి. ఈ రాకెట్ దాడిలో ఇరాన్, ఇరాక్‌కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇరాన్ నిఘా విభాగాధిపతి ఖాసిం సొలీమని ఉన్నట్టు ఇరాక్ మీడియా తెలిపింది.
ఖాసిం సొలీమని తో బాటు మిలిటెంట్ గ్రూప్ కు చెందిన డిప్యూటీ కమాండర్ అబూ మెహిది అల్ ముహందీస్ కూడా మరణించాడు. బాగ్దాద్ విమానాశ్రయంపై దాడిని అమెరికానే చేసిందని ఇరాక్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకే ఖాసిం ను చింపేసినట్లు పెంటగాన్ వెల్లడించింది.