27.7 C
Hyderabad
May 21, 2024 03: 20 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

అమెజాన్ అద్భుత పండుగ ఆఫర్లు

pjimage (2)

వినియోగదారుల సంఖ్యను 20 కోట్లకు పెంచుకోవడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని అమెజాన్‌ సంస్థ ఉపాధ్యక్షుడు మనీష్‌ తివారి వెల్లడించారు. 2018లో 3.5 లక్షలుగా ఉన్న అమెజాన్‌ విక్రేతల సంఖ్యను 2019 నాటికి 5 లక్షలకు పెంచుకోగలిగామన్నారు. ఉత్పత్తుల నాణ్యతపై లభిస్తున్న గ్యారంటీ, నమ్మకం అమెజాన్‌ను వినియోగదారులకు మరింత చేరువ చేస్తోందని ఆయన తెలిపారు. భారత్‌లో అమెజాన్‌ సేవలు ప్రారంభమై ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా వినియోగదారులను 20 కోట్లకు పెంచుకోవాలన్న లక్ష్యంతో భారీ డిస్కౌంట్లతో పలు ఉత్పత్తులను అమెజాన్‌లో అమ్మకానికి ఉంచుతున్నట్లు తివారి వెలడించారు. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని అమెజాన్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేక రాయితీలతో ఈ నెల 29 నుంచి అక్టోబరు 4 వరకు గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోందన్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రైమ్‌ సభ్యులు, 29 ఉదయం 11.59 గంటల నుంచి సాధారణ వినియోగదారులు కొనుగోళ్లను చేపట్టే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఫెస్టివల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు రాయితీతో పాటు రూ.6,000 వరకు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లను అందిస్తున్నామని తెలిపారు. అలాగే గృహోపకరణాలు, టీవీలపై 70 శాతం వరకు రాయితీతో పాటు ఉచిత డోర్‌ డెలివరీ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఎస్‌బిఐ క్రెడిట్‌, డెబిట్‌కార్డులతో చెల్లింపులు చేసేవారికి 10 శాతం డిస్కౌంట్‌ సహా ప్రత్యేక క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు, ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. దసరా, దీపావళి పండగల సందర్భంగా మొత్తం 20 కోట్లకు పైగా ఉత్పత్తులను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచుతున్నట్లు మనీష్‌ తివారి తెలిపారు

Related posts

రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేశాం: డీసీపీ

Satyam NEWS

అజ్మీర్ దర్గా ఉర్సుకు చాదర్ పంపిన సీఎం కేసీఆర్

Bhavani

మ‌రో శైవ క్షేత్రం పుణ్య‌గిరిలో విజ‌య‌న‌గ‌రం పోలీస్ బాస్

Satyam NEWS

Leave a Comment