27.7 C
Hyderabad
April 20, 2024 01: 24 AM
Slider జాతీయం

మనీలాండరింగ్ కేసుల్లో 51 మంది ఎంపిలు 71 మంది ఎమ్మెల్యేలు

#supremecourtofindia

దేశం మొత్తంలో మనీలాండరింగ్ కేసుల్లో 51 మంది ఎంపీలు, 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిందితులుగా ఉన్నారు. ఈ విషయాన్ని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు నివేదించింది.

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరడంతో ఆ మేరకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా నివేదిక రూపొందించి సుప్రీంకోర్టుకు అందించారు.

ఈ మొత్తం కేసుల్లో 58 పెండింగ్ కేసుల్లో జీవతఖైదు శిక్షలు విధించతగినవని అమికస్ క్యూరీ తన నివేదికలో తెలిపారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల్లో 151 కేసులు పెండింగ్‍లో ఉన్నాయి. 45 కేసుల్లో అభియోగాలు కూడా నమోదు కాలేదని అమికస్ క్యూరీ తెలిపారు. మానవ వనరుల కొరత ప్రధాన సమస్యగా ఆయన పేర్కొన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కొరకు అందరం కలిసి శ్రమిద్దాం

Satyam NEWS

మేము సైతం అంటూ పోటీలకు సిద్ధపడ్డ భవాని,శ్రీజ

Satyam NEWS

బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఇంత సంక్షేమం లేదు

Satyam NEWS

Leave a Comment