24.7 C
Hyderabad
March 29, 2024 07: 30 AM
Slider సినిమా

జయాబచ్చన్, ఐశ్వర్యారాయ్ లకు కరోనా లేదు

#Abhishesk Abchaahn

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కరోనా పాజిటీవ్ తో నానావతి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడు బాలివుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటీవ్ వచ్చింది. బచ్చన్ కుటుంబంలోని ఇతర సభ్యులకు కూడా కరోనా టెస్టులు నిర్వహించారు.

సంతోషకరమైన విషయం ఏమిటంటే వారి కుటుంబంలోని మిగిలిన వారికి నెగెటీవ్ వచ్చింది. అమితాబ్ సతీమణి జయబచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ లకు కరోనా నెగెటీవ్ వచ్చింది. మనుమరాలు ఆరాధ్య తదితరులకు కూడా కరోనా నెగెటీవ్ వచ్చింది.

అమితాబ్ బచ్చన్ కు చికిత్స కొనసాగుతున్నదని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని నానావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. నిన్నరాత్రి 10 గంటల సమయంలో అమితాబ్ ను ఆసుపత్రికి తీసుకువచ్చారని అప్పటి నుంచి ఆయన ఆరోగ్య స్థితి మెరుగ్గానే ఉందని వారు వెల్లడించారు.

Related posts

పేదల చెంతకు కార్పొరేట్ వైద్యం చేరువ చేస్తున్నాం

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేత

Satyam NEWS

మాఫియా: ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment