33.7 C
Hyderabad
February 13, 2025 20: 58 PM
Slider ప్రత్యేకం

అమిత్ షాతో భేటీ: జగన్ కు చెక్ గ్యారెంటీ

#amithshah

ఆదివారం ఎన్డీఆర్ఎఫ్ భవనాలను ప్రారంభించడానికి ఒక రోజు ముందే ఏపీకి వచ్చిన అమిత్ షా.. చంద్రబాబు నివాసంలో జరిగిన విందు భేటీలో పాల్గొన్నారు. ఎక్కువగా రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఏపీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య జగన్ రెడ్డేనని ఆయనను రాజకీయంగా నిర్వీర్యం చేయకపోతే పెట్టుబడులు పెట్టేవారు కూడా ఆలోచన చేస్తున్నారని అమిత్ షాకు చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో పదేళ్ల కాలంలో జగన్ రెడ్డి చేసిన మాఫియా తరహా పనుల గురించి కీలకమైన అంశాలను అమిత్ షాకు..లోకేష్ వివరించినట్లుగా తెలుస్తోంది. కంపెనీల యాజమాన్యాలను బెదిరించడం, ఆయా కంపెనీలను స్వాధీనం చేసుకోవడం, లిక్కర్ లో చేసిన భారీ స్కాం, మనీ లాండరింగ్ సహా అనేక అంశాలను ప్రస్తావించారు. అలాంటి వారు రాజకీయాలకు అనర్హులని పక్కా రాజకీయ వ్యూహంతో కూటమి ఆయనను రాజకీయంగా ఎలిమినేట్ చేయాల్సి ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై కూటమి నేతలు అరగంటకుపైగా మేథోమథనం చేసి చివరికి ఓ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారని అంటున్నారు.

దానిపై కార్యాచరణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏపీకి రావడానికి పెట్టుబడిదారులు వ్యక్తం చేస్తున్న అతి పెద్ద సందేహం.. మళ్లీ జగన్ వస్తే ఎలా అని. తాము పెట్టుబడిని కోల్పోలేమని.. తాము గ్యారంటీ ఇవ్వాలని అంటున్నారు. అందుకే జగన్ ఇక రాబోరన్న గట్టి సంకేతాలను పారిశ్రామికవేత్తలకు పంపే చర్యలను త్వరలో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి సంచలనాత్మకంగా.. ఊహించని విధంగా ఉంటాయని భావిస్తున్నారు. అమిత్ షా చంద్రబాబు విందు భేటీ .. రాజకీయంగా కీలక మార్పులకు కారణం అవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Related posts

ఏపిలో మ‌రో 13 మంది ఐపీఎస్ లు బ‌దిలీ…!

Satyam NEWS

చెల్లింపులపై చట్టం

Murali Krishna

8 వ రోజు చాయ్ అమ్ముతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన

Satyam NEWS

Leave a Comment