36.2 C
Hyderabad
April 25, 2024 21: 21 PM
Slider శ్రీకాకుళం

సమగ్ర శిక్ష చిరు ఉద్యోగస్తులకు అన్ని శిక్షలే

teachers

సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు అమ్మ ఒడి వర్తించదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం తీవ్ర నిరాశకు గురి చేసిందని శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవలు, తాత్కాలిక ఉద్యోగస్తుల సంఘ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శి గంగు వెంకటరమణ, గుండ బాల మోహన్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం  పాత్రుని వలస గ్రామం లో నేడు వారు మీడియాతో మాట్లాడారు.

తమకు కేవలం నెలకు రూ. 10, 000, 12,000 మాత్రమే ఇస్తున్నారని, ఈ ఆదాయంతో తమ కుటుంబం పోషణ కష్టంగా ఉన్న సమయంలో అమ్మ ఒడి వర్తిందని చెప్పడం అన్యాయమని వారు అన్నారు. ముఖ్యంగా కేజీబీవీ కళాశాలలో పనిచేస్తున్న మహిళ లెక్చరర్లకు గత ఐదు నెలలుగా జీతం అందకపోవడంతో అప్పులు పాలు అయ్యారని వారు తెలిపారు.

అదేవిధంగా ఈ ప్రాజెక్టులో గత ఎనిమిది సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో  ఒప్పంద ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న ఆర్ట్ ,క్రాఫ్ట్ ,వ్యాయామ ఉపాధ్యాయులకు ఇప్పటికే గత నాలుగు సంవత్సరాలుగా 14, 203 నెల జీతం మాత్రమే ఇస్తున్నారని నేటికీ ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదని వారు తెలిపారు. ఉద్యోగ భద్రత కూడా లేని తమకు అమ్మ ఒడి కార్యక్రమాన్ని తమ పిల్లలు ప్రయివేటు స్కూళ్లలో చదువుతున్నా వర్తింపచేయాలని వారు కోరారు.

Related posts

రాజస్థాన్ హాట్ జిలేబి సమోసా దుకాణాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

అవగాహన లేని జగన్: అమాంతం పెరిగిన కరెంటు చార్జీలు

Satyam NEWS

మైదుకూరు మున్సిపాలిటీలో మాయ చేసిన వైసీపీ

Satyam NEWS

Leave a Comment