39.2 C
Hyderabad
April 25, 2024 17: 15 PM
Slider సినిమా

ఘనంగా అమృత లత అపురూప అవార్డుల ప్రదానోత్సవం

#amruta lata awards

సాహితీవేత్తలకు సన్మానం చేయడం ఎంతో మంచి విషయమని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. 2020- 21 సంవత్సరానికి అమృత లత అపురూప అవార్డుల ప్రదాన కార్యక్రమం నేడు రవీంద్రభారతిలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన వాణీదేవి మాట్లాడుతూ అవార్డులు కళాకారుల బాధ్యత పెంచుతాయని ఆమె తెలిపారు.

అవార్డులు అందుకున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, మరింత మందికి ఆదర్శవంతంగా ఉండాలని ఆమె కోరారు. కళాకారులకు సన్మానాలు బూస్ట్ లాంటివని, ఒక జ్యోతి మరో జ్యోతిని వెలిగించే ప్రక్రియలో భాగమని మామిడి హరి కృష్ణ అన్నారు.

కరోనా మహమ్మారి కాలంలో కూడా కళాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. కరోనా సందర్భంగా కాలం ఆగిపోయిందని దాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

మరిన్ని రంగాలలో నిష్ణాతులైన వారికి అవార్డులు అందచేసే ఆలోచన ఉందని అమృత లత అన్నారు.

నవలా రచనలో ముక్తేవి భారతి, కాయవ రచనలో విహారి, కవిత్వంలో ప్రొఫెసర్ రామాచంద్రమౌళి, శాస్త్రీయ సంగీతంలో దరూరి సులోచనా దేవి, శాస్త్రీయ నృత్యంలో పొఫెసర్ అరుణ బిక్షు, రేడియో టివి రంగంలో అయ్యగారి వసంతలక్ష్మి, సాంస్కృతిక కళాపోషణలో శశిరెడ్డి, నగి, వచన కవిత్వంలో రేణుక అయోల, బాల సాహిత్యంలో కందేపి రాణిప్రసాద్, ప్రజా చైతన్యంలో విమలక్క, కథా రచనలో కుప్పిలి పద్మ, వ్యాసరచనలో డాక్టర్ వి త్రివేణి అవార్డులు పొందారు.

Related posts

మోడీ అంటే గడప గడపకు తెలియ చెప్పాలి

Satyam NEWS

ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టాలి – komaram bheem

Satyam NEWS

108 దేవాలయాల్లో విడుదలైన శ్రీ లక్ష్మీ సహస్ర చిత్రం పాటలు

Satyam NEWS

Leave a Comment