27.7 C
Hyderabad
April 19, 2024 23: 36 PM
Slider ముఖ్యంశాలు

వూహాన్ లాక్ డౌన్ లో ఉన్న భారతీయుడి అనుభవం ఇది

wohan

ఒక రోజు, రెండు రోజులూ కాదు 76 రోజులు నేను నా గదిలో, ప్రయోగశాలలో ఒంటరిగా బతికాను. ఆ రోజుల్లో నేను ఎవరితోనూ మాట్లాడలేదు. మాట్లాడేందుకు ఎవరూ కూడా లేరు. ఇది వూహాన్ లో 76 రోజుల పాటు లాక్ డౌన్ లో ఉన్న ఒక భారతీయుడి అనుభవం.

వూహాన్ లో నివసించే అరుణజిత్ టి సత్రాజిత్ భారతీయ మలయాళీ. హైడ్రోబయాలజిస్ట్ గా పని చేస్తున్నాడు. కరోనా పుట్టి విస్తరిస్తున్న సమయంలో అతను వూహాన్ నుంచి కదల్లేదు. వూహాన్ లోనే ఉన్నాడు. వూహాన్ లో కరోనా భీకరంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో, ఎయిర్ ఇండియా 700 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో తరలించింది. 

కానీ అరుంజిత్ వూహాన్‌లో ఉండటానికే ప్రాధాన్యతనిచ్చాడు. భారత్ రాలేదు. తాను కేరళకు తిరిగి రావడం తన భార్య, బిడ్డ మరియు 50 ఏళ్ల తల్లిదండ్రులను ప్రమాదంలో పడేస్తుందని అతను భావించాడు. అందుకు అక్కడే ఉండిపోయాడు. స్వీయ నిర్భంధం ఒక్కటే కరోనాకు మందు. అంతకు మించి ఏదీ లేదని సత్రాజిత్ అంటున్నాడు. అందుకే భారతీయులు అందరూ కూడా లాక్ డౌన్ లోనే ఉండాలని అతడు చెబుతున్నారు. బయటకు రావద్ద. ఎవరితో మాట్లాడవద్దు అని కూడా చెబుతున్నారు. వూహాన్ లోనే లాక్ డౌన్ లో ఉన్న ఒకే ఒక కారణంతో తాను బతికానని అతడు చెబుతున్నాడు. కోవిడ్ 19 ను ఎదుర్కోవటానికి భారతీయులు తప్పనిసరిగా లాక్డౌన్ పాటించాలని అతను కోరుతున్నాడు.

Related posts

అర్హులైన నిరుపేదలందరికీ పట్టాలిచ్చేవరకు ఉద్యమం

Satyam NEWS

కోటప్పకొండలో ప్రజల్ని ఆకట్టుకున్న అవగాహన స్టాళ్లు

Satyam NEWS

జర్నలిస్టు సురేశ్ ను పరామర్శించిన TWJF నేతలు

Satyam NEWS

Leave a Comment