32.7 C
Hyderabad
March 29, 2024 11: 24 AM
Slider ప్రత్యేకం

కేసీఆర్ ఎమ్మెల్యే కొనుగోళ్లపై కూడా విచారణ చేపట్టాలి

#KCR MLA

రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇరకాటంలో పడబోతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ కు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిన కేసీఆర్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో మరింతగా ఇబ్బందులు పాలు అవ్వబోతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కూడా విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కోరింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఆధారాలతో టీపీసీసీ నేతల బృందం మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ముందుగా సీఎల్పీలో భేటీ అయిన నేతలు అనంతరం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. 455 ఎఫ్.ఐ. ఆర్. తో పాటు తాము ఇచ్చిన ఆధారాలను కూడా పరిశీలించాలని తెలిపారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కేసీఆర్ కుట్రను ఛేదించాలని, కేసీఆర్ ఫిరాయింపు రాజకీయాలకు సమాధి కట్టాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులతో కెసీఆర్ తన అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకున్నారని విమర్శించారు. అందుకే 2014 నుంచి పాలనను గాలికి వదిలి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారన్నారు.

2018లో కేసీఆర్ పార్టీలో 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, హామీలు అమలు చేయాలని జనం సంపూర్ణ మెజారిటీ ఇచ్చినా కేసీఆర్ ఆలోచనలో మార్పు రాలేదని తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చినా ఫిరాయింపులను కొనసాగించారన్నారు. ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే చూసి కేసీఆర్ ఓర్వలేకపోయారని, అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిరాయింపులకు ప్రోత్సహించారని రేవంత్ మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వివిధ సందర్భాల్లో పిర్యాదు చేసినా స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించలేదని ఆరోపించారు.

పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులకు లంచంగా ప్రభుత్వం పదవులు, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చిందన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఫిరాయింపులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని, కేవలం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లోనే కాకుండా డీజీపీ, ఈడీ, సీబీఐ డైరెక్టర్ కు కూడా పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తామని తెలిపారు రేవంత్. విచారణ వ్యవస్థలు సరిగా స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అవసరమైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ చట్టసభల్లో అడుగు పెట్టకుండా రాజకీయ పోరాటం చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు రేవంత్.

Related posts

జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టడం హాస్యాస్పదం

Satyam NEWS

ప్రపంచ ఆవిష్కరణ మరియు సృజనాత్మకత దినోత్సవం

Satyam NEWS

రేపు తొలి ఏకాదశి పర్వదినం: ఆ రోజు ఏం చేయాలంటే….

Satyam NEWS

Leave a Comment