36.2 C
Hyderabad
April 25, 2024 22: 28 PM
Slider ప్రత్యేకం

అగ్నిపరీక్షలో రఘురాముడిని గాలికి వదిలేసిన కమలనాథులు

#APBJP

‘‘రాజు గారూ బాగున్నారా’’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రేమ పూర్వకంగా పార్లమెంటు సెంట్రల్ హాల్ లో తెలుగులో పలకరించగానే పులకరించిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి రఘురామకృష్ణంరాజును తాజా పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బిజెపి నిండా ముంచేసింది.

రఘురామ కృష్ణంరాజును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన నాటి నుంచి బిజెపి నేతలు మొక్కుబడి ప్రకటనలు జారీ చేయడం తప్ప ఏ మాత్రం క్రియాశీలకంగా వ్యవహరించలేదు. ఏపి బిజెపి నాయకులకన్నా ముందుగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించి ఆయన అరెస్టును ఖండించారు.

ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఏపి బిజెపి నేతలు స్పందించడం మొదలు పెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి హోం మంత్రిత్వ శాఖ నుంచి చర్యలు తీసుకునేలా చేయడంలో ఘోరంగా విఫలం అయ్యారు.

విఫలం అయ్యారు అనే కన్నా రఘురాముడిని ముంచేశారు అనడం కరెక్టుగా ఉంటుంది. ఏపి బిజెపిలో అనాదిగా రెండు వర్గాలు ఉంటున్నాయి. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు బిజెపి, చంద్రబాబు వ్యతిరేక బిజెపి ఉండేవి.

ఇప్పుడు జగన్ అనుబంధ బిజెపి, జగన్ వ్యతిరేక బిజెపిగా అవి చీలిపోయి పని చేస్తున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు జగన్ వ్యతిరేక బిజెపి చురుకుగా ఉండేది. సోము వీర్రాజు అధ్యక్షుడు కాగానే జగన్ అనుకూల బీజేపీ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తున్నది.

ఈ సందర్భంలోనే రఘురాముడి అరెస్టు విషయంలో కూడా బిజెపి రెండు గా చీలిపోయింది. రఘురాముడి అరెస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయంగా చూడాలని కొందరు బిజెపి నాయకులు అభిప్రాయపడ్డారని తెలిసింది.

ఒక ఎంపిని అరెస్టు చేసినందున స్పందించకపోతే బాగుండదని మరో వర్గం వాదించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవడానికి బిజెపి అధిష్టానవర్గానికి సమయం పట్టింది. దాంతో బిజెపి నాయకుల స్పందన ఆలశ్యం అయింది.

కేంద్ర ప్రభుత్వ హోం శాఖ నుంచి అయినా నివేదిక కోరారా అంటే అదీ కూడా ఇదమిద్ధంగా తెలియడం లేదు. ఈ పరిణామాలతో బిజెపిలోని జగన్ అనుకూల వర్గం పైచేయి సాధించినట్లుగా చెప్పుకుంటున్నారు. ఏపి వ్యవహారాలలో చంద్రబాబునాయుడిపై విరుచుకుపడే జీవీఎల్ నరసింహారావు రఘురామ అరెస్టు జరిగిన 36 గంటల తర్వాత స్పందించారు.

అప్పటికే ఏపిలో అన్నిరకాల పరిణామాలూ జరిగిపోయాయి. కంటితుడుపు చర్యగా బిజెపి నేతలు ఇచ్చిన ప్రకటనలు కేవలం ఒకటి రెండు పత్రికలలో, ఒకటి రెండు ఛానెళ్లలో కనిపించాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలపై పెద్దగా ప్రభావం చూపలేదు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఘాటుగా స్పందించి ఉంటే రఘురామకృష్ణంరాజు ఇంత దీనమైన స్థితిలోకి వెళ్లి ఉండేవారు కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. బిజెపి అధిష్టానాన్ని కట్టడి చేయడంలో జగన్ అనుకూల బిజెపి విజయం సాధించింది.

Related posts

ఖమ్మం జిల్లాలో 5 నామినేషన్లు

Satyam NEWS

దేశంలో లాక్ డౌన్ కొనసాగడమే మంచిది

Satyam NEWS

విశాఖ సముద్రంలో 50 అడుగుల భారీ మత్స్యం..!!

Satyam NEWS

Leave a Comment